ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్వచ్ఛ తిరుపతి

ABN, Publish Date - Jul 20 , 2025 | 01:16 AM

దేశానికంతా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి స్వచ్ఛతలో కూడా దేశానికి ఆదర్శం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ప్రజా వేదికలో మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూపర్‌ సిటీస్‌ కేటగిరీలో తిరుపతికి ఉత్తమ అవార్డు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచీ కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వస్తున్న నేపధ్యంలో నగరంలో పరిశుభ్రత ప్రతిఫలించాలని సూచించారు. నగరం శుభ్రంగా లేకుంటే భక్తులకు తిరుపతి మీద సదభిప్రాయం కలగదని హెచ్చరించారు. అవార్డుల్లో ఫైవ్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ సాధించిన తిరుపతి భవిష్యత్తులో సెవెన్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ సాధించాలని పిలుపునిచ్చారు. రూ. 150 కోట్లతో మోడల్‌ సిటీగా తిరుపతి గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తిరుపతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద పలు పనులు మిగిలిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు కింద పలు రోడ్లు, డ్రైయిన్‌ పనులు పెండింగులో వున్నాయన్నారు. రూ. 150 కోట్లతో తిరుపతిని మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. దివ్యక్షేత్రంగా వున్న తిరుపతిని విద్యా కేంద్రంగానూ, నాలెడ్జి ఎకానమీ హబ్‌గానూ అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీవారి పాదాల చెంత వివాహాలు చేసుకునే విధంగా వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతిని మారుస్తామన్నారు. దానికోసం ఉత్తమ మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

పారిశుధ్య కార్మికులకు మెమెంటోలు అందిస్తున్న ముఖ్యమంత్రి

- దేశానికి ఆదర్శం కావాలి!

-శ్రీవారి పాదాల చెంతకు హంద్రీ జలాలు

తిరుపతి ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు

‘‘వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి ప్రజలు ఏనాడైనా ప్రశాంతంగా నిద్రపోయారా? తిరుపతి నగరప్రజలకు తెలుగు గంగ నీరిచ్చింది ఎవరు? నగరానికి గరుడ వారధి తెచ్చింది ఎవరు? తిరుపతిలో పాతుకుపోయిన రౌడీలను నిర్మూలించి వారి గుండెల్లో నిద్రపోయిన పార్టీ తెలుగుదేశం’’

తిరుపతి నగరం అధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ఆర్థికంగానూ ఎదగాలి. భారతదేశానికి ఆదర్శం కావాలి.

తిరుపతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దేశానికంతా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి స్వచ్ఛతలో కూడా దేశానికి ఆదర్శం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ప్రజా వేదికలో మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూపర్‌ సిటీస్‌ కేటగిరీలో తిరుపతికి ఉత్తమ అవార్డు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచీ కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వస్తున్న నేపధ్యంలో నగరంలో పరిశుభ్రత ప్రతిఫలించాలని సూచించారు. నగరం శుభ్రంగా లేకుంటే భక్తులకు తిరుపతి మీద సదభిప్రాయం కలగదని హెచ్చరించారు. అవార్డుల్లో ఫైవ్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ సాధించిన తిరుపతి భవిష్యత్తులో సెవెన్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ సాధించాలని పిలుపునిచ్చారు.

రూ. 150 కోట్లతో మోడల్‌ సిటీగా తిరుపతి

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తిరుపతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద పలు పనులు మిగిలిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు కింద పలు రోడ్లు, డ్రైయిన్‌ పనులు పెండింగులో వున్నాయన్నారు. రూ. 150 కోట్లతో తిరుపతిని మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. దివ్యక్షేత్రంగా వున్న తిరుపతిని విద్యా కేంద్రంగానూ, నాలెడ్జి ఎకానమీ హబ్‌గానూ అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీవారి పాదాల చెంత వివాహాలు చేసుకునే విధంగా వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతిని మారుస్తామన్నారు. దానికోసం ఉత్తమ మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లా రుణం తీర్చుకుంటా!

రూ. 3850 కోట్లతో 550 కిలోమీటర్ల మేరకు కాలువ తవ్వించి కుప్పం వరకూ హంద్రీ-నీవా జలాలు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. తిరుపతి జిల్లాలో మల్లిమడుగుకు నీరు తెస్తామని, బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసి దానికి నీటిని మళ్ళిస్తామన్నారు. సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని బాలాజీ రిజర్వాయర్‌కు తరలిస్తామన్నారు. అక్కడి నుంచి కాలువలు తవ్వించి మధ్యలో వేణుగోపాల సాగర్‌ నిర్మిస్తామని, ఆ రిజర్వాయర్‌ నింపడంతో పాటు హంద్రీ-నీవా జలాలను పిచ్చాటూరు అరణియార్‌ ప్రాజెక్టుకు చేరుస్తామన్నారు. అదే విధంగా మంగళంపేట నుంచి మూలపేట చెరువు మీదుగా కళ్యాణి డ్యామ్‌కు నీరివ్వడం ద్వారా శ్రీవారి పాదాల చెంతకు హంద్రీ నీవా నీరు తెస్తామన్నారు. ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లా రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఉరకలెత్తిన యువత

సీఎం చంద్రబాబు ప్రజావేదిక ప్రాంగణంలోకి అడుగుపెట్టింది మొదలు వెనుదిరిగే వరకూ యువత, మహిళలు నినాదాలు, చప్పట్లు, ఈలలు, కేకలతో హోరెత్తించారు. సీఎం ప్రాంగణంలోకి వచ్చి స్టాల్స్‌ పరిశీలిస్తున్నంత సేపూ ఆ దృశ్యాలు వేదిక పక్కన ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రదర్శించారు. వాటిని చూస్తూ జనం హర్షధ్వానాలు చేశారు. సీఎం వేదిక మీదకు వచ్చాక ఆయన ప్రసంగం కొనసాగినంత సేపూ ఈలలు, కేకలు, నినాదాలతో పాటు ప్లకార్డులు చూపుతూ సందడి చేశారు. ప్రజలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టేందుకు యత్నించినప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో జనం స్పందించారు. ప్రజావేదికలో పాల్గొన్న వారిలో అత్యధికులు మహిళలు, విద్యార్థులే కావడంతో కార్యక్రమం కొనసాగినంత సేపూ వారి కేరింతలతో ప్రాంగణం మార్మోగింది. వారి స్పందన చూసి సీఎం సైతం అంతే ఉత్సాహంతో ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రజావేదికలో మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, పొంగూరు నారాయణ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్‌రెడ్డి, గాలి భానుప్రకాష్‌, తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, కమిషనర్‌ మౌర్య, ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుగుణమ్మ, ఏపీ యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుద్రకోటి సదాశివం, మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధరవర్మ, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, నేతలు కోడూరు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:16 AM