ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో పులికాట్‌ పూడికతీత

ABN, Publish Date - Jun 26 , 2025 | 01:26 AM

సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పులికాట్‌ సరస్సు పూడికతీత పనులు త్వరలో మొదలు కానున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం వెల్లడించారు.

రెండు వారాల్లో టెండర్ల ఖరారు

కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పులికాట్‌ సరస్సు పూడికతీత పనులు త్వరలో మొదలు కానున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు రెండు వారాల్లో ఖరారు కానున్నాయని చెప్పారు. ఏపీ, తమిళనాడుల్లో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సు ఏపీ పరిధిలో కొన్ని దశాబ్దాలుగా పూడికతీతకు నోచుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా రూ.135 కోట్లతో పూడికతీత పనులు చేపట్టాల్సి వుండగా అందులో కేంద్రం వాటా కింద రూ.98 కోట్లు విడుదలైందన్నారు. తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, చిల్లకూరు, వాకాడు మండలాల పరిధిలోని పులికాట్‌ సరస్సులోకి వాకాడు మండలం పూడిరాయి దొరువు వద్ద సముద్ర ముఖద్వారం ఉందన్నారు. అక్కడ పూడిక తీయకపోవడంతో మేట వేసుకుపోయి సముద్రనీరు సరస్సులోకి సక్రమంగా రావడం లేదన్నారు. అందువల్ల ఏటా గణనీయంగా మత్స్య సంపదను కోల్పోతున్నామని వివరించారు. పూడిరాయి దొరువు వద్ద పూడికతీత పనులకు ఇటీవలే టెండర్లు పిలవగా, నిబంధన ప్రకారం ఖరారు చేయడానికి మరో రెండు వారాలు పడుతుందన్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు.

Updated Date - Jun 26 , 2025 | 01:26 AM