ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన ఎస్జీటీల పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Jun 07 , 2025 | 02:00 AM

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీల) పదోన్నతి కౌన్సెలింగ్‌ శుక్రవారం ముగిసింది.

చిత్తూరు సెంట్రల్‌,జూన్‌6 (ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీల) పదోన్నతి కౌన్సెలింగ్‌ శుక్రవారం ముగిసింది. స్థానిక డీఈవో కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన ఈ ప్రక్రి య సాగింది. ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతికి 273 ఖాళీలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిల్లో.. జడ్పీ యాజమాన్యంలో 106, ప్రభుత్వ యాజమాన్యంలో ఒకటి, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 54, మున్సిపాలిటీ యాజమాన్యం పాఠశాలల్లో 112 ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం 1ః3 రేషియోలో 819 ఎస్జీటీలను కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీనియారిటీ జాబితా ఆధారంగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. రాత్రి వరకు కౌన్సెలింగ్‌ ద్వారా పదోన్నతులు చేపట్టారు. శనివారం నుంచి సీనియారిటీ జాబితా ఆధారంగా ఎస్జీటీలకు బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Updated Date - Jun 07 , 2025 | 02:00 AM