22నుంచి ఇంటి నుంచే తపాలా శాఖ సేవలు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:42 AM
అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0తో అనేకరకాల సేవలను ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా పొందే సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు.
18 నుంచి 21వ తేదీవరకు తాత్కాలిక అంతరాయం
చిత్తూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ
చిత్తూరు రూరల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0తో అనేకరకాల సేవలను ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా పొందే సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. మంగళవారం స్థానిక పోస్టల్ డివిజన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన టెక్నాలజీని ఈనెల 22వ తేదీ నుంచి డివిజన్ పరిధిలోని 427 పోస్టాఫీసుల్లో ఈ సేవలను అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 18 నుంచి 21వ తేదీవరకు చిత్తూరు, మదనపల్లె హెడ్‌పోస్టాఫీసులతోపాటు చిత్తూరు డివిజన్‌లోని 21 సబ్‌పోస్టాఫీసులు, 374 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో అన్నిరకాల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అన్ని సేవలు ఈనెల 22వ తేదీన పునఃప్రాంభమవుతాయని వివరించారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్ శాఖలోనూ అనేక రకాల సేవలను అందించడానికి డాక్ సేవా యాప్ కూడా అమల్లో ఉందని గుర్తుచేశారు.
Updated Date - Jul 16 , 2025 | 01:42 AM