ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్చ్‌.. మామిడి!

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:08 AM

మామిడికి ఈ ఏడాది గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోయారు. రేటు మాట అటుంచితే.. ఫ్యాక్టరీలకు తోతాపురి కాయలు తోలేందుకూ ఇబ్బంది పడ్డారు. ట్రాక్టర్లలో కాయలు లోడ్‌ చేసి.. పల్ప్‌ ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తూ, మరోవైపు కుళ్లిపోతున్న కాయలు చూసి ఆవేదన చెందారు.

మామిడితోట మారిందిలా..

లాభాల్లేక ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి

చంద్రగిరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మామిడికి ఈ ఏడాది గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోయారు. రేటు మాట అటుంచితే.. ఫ్యాక్టరీలకు తోతాపురి కాయలు తోలేందుకూ ఇబ్బంది పడ్డారు. ట్రాక్టర్లలో కాయలు లోడ్‌ చేసి.. పల్ప్‌ ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తూ, మరోవైపు కుళ్లిపోతున్న కాయలు చూసి ఆవేదన చెందారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. గతంలో అన్ని పంటలలో రారాజుగా మామిడి ఉండేది. కొన్నేళ్ల క్రితం మామిడి పంటల ద్వారా అధిక దిగుబడితో రైతులను ఆర్థిక పురోగతిని పెంచింది. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మామిడి పంటను ప్రోత్సహించాయి. ఇలా జిల్లాలో మామిడి సాగు పెరిగింది. గత కొన్నేళ్లుగా మామిడిలో లాభాలు అంతగా రాలేదు. వచ్చే సంవత్సరమైనా లాభాలు రాకపోతాయా అంటూ .. ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే, ఈ ఏడాది తోతాపురి పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో పంట విక్రయించలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం గిట్టుబాటు ధర కూడా లేక చాలామంది అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో మామిడి పంటపై ఆశలు వదులుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మామిడి చెట్లను కాపాడుకొంటూ వస్తున్న రైతుల్లో.. పలువురు ఇప్పుడు చెట్లను నరికేస్తున్నారు. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ధనంయజయ నాయుడికి ఏడు ఎకరాలు మామిడి చెట్లున్నాయి. పాశం గోపాల్‌నాయుడు మూడు ఎకరాలు, ముంగిలిపట్టుకు చెందిన మునిశేఖర్‌నాయుడు రెండున్నర ఎకరాలలో మామిడి సాగు చేశారు. మామిడిలో లాభాలు లేకపోవడంతో చెట్లను తొలగిస్తున్నారు. వీటి స్థానంలో కొబ్బరి చెట్లు, లేదా అంతర పంటలు, లేక పొట్టేలు.. కోళ్లఫారం, డెయిరీ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు.

పురుగులు, నకిలీ మందులే కారణం

ఇప్పుడు మామిడి పంట అధిక దిగుబడి వచ్చినా అందులో పురుగులున్నాయి. పంటను నాశనం చేస్తున్నాయి. అనేక రకాల మందులు వాడినా ప్రయోజనం లేదు. దీనికి కారణం నకిలీ మందులే ఎక్కువగా ఉండటం. ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా ఉండే.. నిర్వహణ తక్కువ ఉండే పంటలను వేయాలని మామిడి చెట్లను తొలగించాం.

- ధనంజయలునాయుడు, ఎం.కొంగరవారిపల్లె

Updated Date - Jul 25 , 2025 | 02:08 AM