‘రాజముద్ర’తోనే పట్టాదారు పాసుపుస్తకం
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:17 AM
ప్రభుత్వ రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్‌పుస్తకాలు) ప్రభుత్వం జారీ చేయనుంది. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరఫరా చేసేందుకు రెండు విడతల్లో 79,062 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. తొలివిడతలో 46,627, రెండో విడతలో 32,435 పట్టాదారు పాస్‌పుస్తకాలు చేరాయి. వీటిని కలెక్టరేట్ నుంచి జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాల ద్వారా ఆయా మండలాల కార్యాలయాలకు పంపిణీ దాదాపు పూర్తికావొచ్చింది. డివిజన్లవారీగా చిత్తూరుకు 27,169, కుప్పంకు 14,465, నగరికి 10,902, పలమనేరుకు 26,526 పుస్తకాలు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యుటేషన్ పూర్తయిన భూములకు సంబంధించి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలు జిల్లాకు వచ్చాయని డీఆర్వో మోహన్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వాటిని ఆయా మండలాలకు ఆర్డీవో కార్యాలయాల ద్వారా పంపించినట్లు చెప్పారు.
‘రాజముద్ర’తోనే పట్టాదారు పాసుపుస్తకం
- జారీకి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
- ఇప్పటికే జిల్లాకు చేరిన 79,062
భూ యాజమాన్య హక్కు పత్రాలు
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్‌పుస్తకాలు) ప్రభుత్వం జారీ చేయనుంది. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరఫరా చేసేందుకు రెండు విడతల్లో 79,062 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. తొలివిడతలో 46,627, రెండో విడతలో 32,435 పట్టాదారు పాస్‌పుస్తకాలు చేరాయి. వీటిని కలెక్టరేట్ నుంచి జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాల ద్వారా ఆయా మండలాల కార్యాలయాలకు పంపిణీ దాదాపు పూర్తికావొచ్చింది. డివిజన్లవారీగా చిత్తూరుకు 27,169, కుప్పంకు 14,465, నగరికి 10,902, పలమనేరుకు 26,526 పుస్తకాలు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యుటేషన్ పూర్తయిన భూములకు సంబంధించి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలు జిల్లాకు వచ్చాయని డీఆర్వో మోహన్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వాటిని ఆయా మండలాలకు ఆర్డీవో కార్యాలయాల ద్వారా పంపించినట్లు చెప్పారు.
వైసీపీ హయాంలో తప్పులతడకగా..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం కింద రీసర్వే చేపట్టి జారీచేసిన భూ హక్కు పత్రాల్లో వివరాలు తప్పులతడకగా ఉండడం, సర్వేలో లోపాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతేగాక భూయజమాని ఫొటో కంటే అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటో పెద్దగా ఉండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రచార ఆర్భాటమే తప్ప అప్పటి ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక భూహక్కు పత్రాల్లో జగన్మోహన్‌రెడ్డి ఫొటోను తొలగించి.. గతంలో మాదిరిగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీచేస్తామని ప్రకటించి, ఆ మేరకు చర్యలు చేపట్టింది.
Updated Date - Aug 04 , 2025 | 01:17 AM