ముగిసిన అమ్మవారి వసంతోత్సవాలు
ABN, Publish Date - May 14 , 2025 | 12:42 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఉదయం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం జరిగింది.
తిరుచానూరు, మే 13(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఉదయం మూలమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం జరిగింది. మధ్యాహ్నం ఉత్సవర్లను ఫ్రైడే గార్డెన్‌కు వేంచేపు చేసి బంగారు పీఠంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి అమ్మవారికి వీధోత్సవం జరిగింది. మూడు రోజులపాటు జరిగిన వేడుకలు మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టీటీడీ ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసులు, ఏఈవో దేవరాజులు, అర్చకులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:42 AM