అయ్యా.. నే బతికే ఉండా
ABN, Publish Date - Jul 30 , 2025 | 01:49 AM
కేవీబీపురం తహసీల్దారు కార్యాలయం వద్ద దీనంగా నిలబడి ఉన్న ఈమె పేరు జమృతాబీ. వయసు 55 ఏళ్లు. ఓళూరు గ్రామం. ఆమె ఆధార్ నెంబరును కంప్యూటరులో ఎంట్రీ చేస్తే.. చనిపోయినట్లు చూపుతోంది. దీంతో రేషన్ కార్డు పోయింది. పింఛనూ రావడం లేదు. సారూ, నేను బతికే ఉన్నానంటూ నాలుగేళ్లుగా ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వాళ్లు లేరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరబాటు ఈమెను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. వీరి కుటుంబ రేషన్ కార్డులో యజమానురాలుగా జమృతాబీ ఫొటో ఉంది. ఈమె అత్త జైనాబీ పేరు పెట్టారు. నాలుగేళ్ల కిందట జైనాబీ మృతిచెందారు. అప్పట్లో జైనాబీ పేరుకు జమృతాబీ ఆధార్‌ను లింక్ చేసి చనిపోయినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. అప్పట్నుంచి తాను బతికే ఉన్నానని చెప్పుకొనేందుకే జమృతాబీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
కేవీబీపురం, ఆంధ్రజ్యోతి
కేవీబీపురం తహసీల్దారు కార్యాలయం వద్ద దీనంగా నిలబడి ఉన్న ఈమె పేరు జమృతాబీ. వయసు 55 ఏళ్లు. ఓళూరు గ్రామం. ఆమె ఆధార్ నెంబరును కంప్యూటరులో ఎంట్రీ చేస్తే.. చనిపోయినట్లు చూపుతోంది. దీంతో రేషన్ కార్డు పోయింది. పింఛనూ రావడం లేదు. సారూ, నేను బతికే ఉన్నానంటూ నాలుగేళ్లుగా ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వాళ్లు లేరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరబాటు ఈమెను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. వీరి కుటుంబ రేషన్ కార్డులో యజమానురాలుగా జమృతాబీ ఫొటో ఉంది. ఈమె అత్త జైనాబీ పేరు పెట్టారు. నాలుగేళ్ల కిందట జైనాబీ మృతిచెందారు. అప్పట్లో జైనాబీ పేరుకు జమృతాబీ ఆధార్‌ను లింక్ చేసి చనిపోయినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. అప్పట్నుంచి తాను బతికే ఉన్నానని చెప్పుకొనేందుకే జమృతాబీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్‌కార్డు అడుగుతున్నారు. పింఛను వస్తే తన జీవితం గడిచిపోతుందని ఆమె ఆశ. గతనెల 24వ తేదీన తిరుపతిలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలోనూ ఆమె తన పరిస్థితి వివరిస్తూ ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చారు. ‘భర్త లేడు. ఏ అండాలేని తనకు రేషన్‌కార్డు, పింఛు ఇచ్చి ఆదుకోండి’ అంటూ మొర పెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించి కార్డు ఇప్పించండంటూ కలెక్టరేట్ నుంచి మండల అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ఈ నెల14న ఆమె కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీ ఇచ్చారు. మంగళవారం నాటికంతా సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని చెప్పారు. మంగళవారం వచ్చింది.. వీఆర్వో వచ్చి సమస్యను పరిష్కరించామంటూ ఆమె వద్ద సంతకం తీసుకున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ఆమె తన గోడు వెల్లబోసుకున్నారు.
-
Updated Date - Jul 30 , 2025 | 01:49 AM