ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నమయ్య వద్దు చిత్తూరు లేదా తిరుపతే ముద్దు

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:55 AM

చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లా పరిధిలోకి పులిచెర్ల మండలాన్ని బదిలీ చేయ డంపై ఆ ప్రాంతవాసుల నుంచి చిత్తూరు కలెక్టరేట్‌కు 12 అభ్యంతరాలు అందాయి. పుంగనూరు మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేయవద్దంటూ ఒక అభ్యంతరం అందింది.మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి దృష్ట్యా చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లాకు ఆరు మండలాలను బదిలీ చేస్తున్నట్లు మేనెల 22న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేరిట చిత్తూరు జిల్లా గెజిట్‌ ప్రచురితమైంది.జిల్లాల పునర్విభజన, పునర్నిర్మాణ చట్టప్రకారం పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలను అన్నమయ్య జిల్లాలోకి బదిలీచేస్తూ కలెక్టర్‌ ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ మేరకు పలమనేరు రెవిన్యూ డివిజన్‌లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌లో వివరించారు.ఈ ప్రతిపాదన పట్ల ప్రభావిత జిల్లాలోని నివాసితులనుంచి అభ్యంతరాలను, సూచనలను నెలరోజుల్లోగా (జూన్‌ 21లోగా) పంపుకోవచ్చని, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని కలెక్టర్‌ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.కలెక్టర్‌ ఇచ్చిన గడువు లోపల 12 అభ్యంతరాలు పులిచెర్ల మండలంనుంచి అందాయి.పులిచెర్ల మండలం చిత్తూరు లేదా తిరుపతి జిల్లాల్లో వుంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుందని, కనుక ఇక్కడే కొనసాగించాలని కలెక్టర్‌కు ఇచ్చిన అభ్యంతరాల్లో వివరించారు. పలమనేరు రెవిన్యూ డివిజన్‌లోని పుంగనూరు మండలాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు బదిలీ చేయవద్దంటూ అక్కడి ప్రజలు లిఖితపూర్వకంగా కలెక్టర్‌ను కోరారు. స్థానిక ప్రజల నుండి అందిన అభ్యంతరాలను జిల్లా యంత్రాంగం మంగళవారం నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

  • గెజిట్‌ నోటిఫికేషన్‌పై 13 అభ్యంతరాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లా పరిధిలోకి పులిచెర్ల మండలాన్ని బదిలీ చేయ డంపై ఆ ప్రాంతవాసుల నుంచి చిత్తూరు కలెక్టరేట్‌కు 12 అభ్యంతరాలు అందాయి. పుంగనూరు మండలాన్ని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేయవద్దంటూ ఒక అభ్యంతరం అందింది.మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి దృష్ట్యా చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లాకు ఆరు మండలాలను బదిలీ చేస్తున్నట్లు మేనెల 22న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేరిట చిత్తూరు జిల్లా గెజిట్‌ ప్రచురితమైంది.జిల్లాల పునర్విభజన, పునర్నిర్మాణ చట్టప్రకారం పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలను అన్నమయ్య జిల్లాలోకి బదిలీచేస్తూ కలెక్టర్‌ ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ మేరకు పలమనేరు రెవిన్యూ డివిజన్‌లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌లో వివరించారు.ఈ ప్రతిపాదన పట్ల ప్రభావిత జిల్లాలోని నివాసితులనుంచి అభ్యంతరాలను, సూచనలను నెలరోజుల్లోగా (జూన్‌ 21లోగా) పంపుకోవచ్చని, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని కలెక్టర్‌ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.కలెక్టర్‌ ఇచ్చిన గడువు లోపల 12 అభ్యంతరాలు పులిచెర్ల మండలంనుంచి అందాయి.పులిచెర్ల మండలం చిత్తూరు లేదా తిరుపతి జిల్లాల్లో వుంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుందని, కనుక ఇక్కడే కొనసాగించాలని కలెక్టర్‌కు ఇచ్చిన అభ్యంతరాల్లో వివరించారు. పలమనేరు రెవిన్యూ డివిజన్‌లోని పుంగనూరు మండలాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు బదిలీ చేయవద్దంటూ అక్కడి ప్రజలు లిఖితపూర్వకంగా కలెక్టర్‌ను కోరారు. స్థానిక ప్రజల నుండి అందిన అభ్యంతరాలను జిల్లా యంత్రాంగం మంగళవారం నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

Updated Date - Jun 25 , 2025 | 12:55 AM