ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌లోనూ జాతీయ ప్రమాణాల విద్య

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:08 AM

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో మ్యాథ్స్‌- ఏ, బీ రెండింటినీ ఒకే సబ్జెక్టుగా.. బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిసి బయాలజీగా రూపొందించారు. పార్టు-1 సబ్జెక్టు కింద ఆంగ్లం మాత్రమే ఉంటుంది. పార్టు-2 కింద జాతీయ భాషలతోపాటు మరికొన్ని సబ్జెక్టులుంటాయి. విద్యార్థి తన అభీష్టం మేరకు ఏదైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టు-2లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. నూతన విధానంలో ఎంపీసీ విద్యార్థి అదనపు సబ్జెక్టుగా బయాలజీని, బైపీసీ వారు గణితాన్ని ఎంచుకోవచ్చు. పార్టు 1,2,3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే పరిగణిస్తారు. ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో 80 మార్కులకు, ఇతర అంశాల్లో వంద మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌ 20 మార్కులు ఉంటాయి.

పీసీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో సీబీఎ్‌సఈ విధానం

- నేడు జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం

ఇంటర్మీడియట్‌లోనూ సీబీఎ్‌సఈ విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబ్‌సను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా పరీక్షల విధానం, మార్కుల కేటాయింపుల్లోనూ నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నారు.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో మ్యాథ్స్‌- ఏ, బీ రెండింటినీ ఒకే సబ్జెక్టుగా.. బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిసి బయాలజీగా రూపొందించారు. పార్టు-1 సబ్జెక్టు కింద ఆంగ్లం మాత్రమే ఉంటుంది. పార్టు-2 కింద జాతీయ భాషలతోపాటు మరికొన్ని సబ్జెక్టులుంటాయి. విద్యార్థి తన అభీష్టం మేరకు ఏదైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టు-2లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. నూతన విధానంలో ఎంపీసీ విద్యార్థి అదనపు సబ్జెక్టుగా బయాలజీని, బైపీసీ వారు గణితాన్ని ఎంచుకోవచ్చు. పార్టు 1,2,3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే పరిగణిస్తారు. ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో 80 మార్కులకు, ఇతర అంశాల్లో వంద మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌ 20 మార్కులు ఉంటాయి.

కోర్సులు ఇలా..

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులుండగా, ఈ ఏడాది ఎంబైపీసీ, ఎంఈసీ గ్రూపులు కొత్తగా అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, తమిళ మీడియంలు ఉండగా.. హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళం ద్వితీయ భాషగా తీసుకునే వెసులుబాటు ఉంది.

శిక్షణ పూర్తి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని అధ్యాపకులకు నూతన విద్యా విధానం, సిలబస్‌, ఇతర పాఠ్యాంశాలపై ఏప్రిల్‌ 24 నుంచి మూడ్రోజులపాటు శిక్షణ పూర్తి చేశారు. మరో వైపు రాయలసీమ రీజియన్‌ పరిధిలో 68 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 400 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, 68మంది ప్రిన్సిపాళ్ల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది.

రెండో దశల్లో అడ్మిషన్లు

ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు పొందేందుకు రెండు సార్లు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 24 నుంచి మే 7వ తేదీ వరకు తొలి దశ అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టగా, జూన్‌ రెండో తేదీనుంచి రెండో దశ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

తొలి రోజునే పాఠ్య పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తొలిరోజునే పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు 28,807 పాఠ్యపుస్తకాలు ఇవ్వనున్నారు. ద్వితీయ సంవత్సరంలో ఇప్పటికే కొందరికి అందజేయగా, మిగిలిన విద్యార్థులకు 5,464 పాఠ్యపుస్తకాలు ఇవ్వనున్నారు.

జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యం

ఇంటర్‌లో సీబీఎ్‌సఈ అమలు చేయడం వల్ల ప్రతి విద్యార్థినీ రాష్ట్ర స్థాయితోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నాం.

- శ్రీనివాసులు, డీఐఈవో, చిత్తూరు

ఫ జిల్లాలోని కళాశాలలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 31

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 59

హైస్కూల్‌ ప్లస్‌ 24

ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలు 07

కేజీబీవీలు 08

రెసిడెన్షియల్‌ కళాశాలలు 01

మోడల్‌ స్కూల్స్‌ 07

సాంఘిక సంక్షేమ

జూనియర్‌ కళాశాలలు 04

--------------------------------------------------

మొత్తం కళాశాలలు 141

మొత్తం విద్యార్థులు 28,261

--------------------------------------------------

Updated Date - Jun 02 , 2025 | 02:08 AM