ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నడివీధి గంగమ్మకు నీరాజనం

ABN, Publish Date - May 15 , 2025 | 01:54 AM

చిత్తూరులో రెండు రోజుల నడివీధి గంగ జాతర బుధవారం కోలాహల వాతావరణంలో ముగిసింది.గంగమ్మకు జాతర వంశపారంపర్య ధర్మకర్తలు సీకేబాబు కుటుంబసభ్యులు, హేమంత్‌కుమార్‌, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ స్థానిక పొన్నియమ్మ గుడిలో అమ్మవారి గజమాలకు, సారెకు పూజలు నిర్వహించారు.

వెండి కవచాల అలంకరణలో పూజలందుకుంటున్న గంగమ్మ

మేళాతాళాల నడుమ సారె సమర్పణ

ఆకట్టుకున్న ఓంశక్తి భక్తుల విన్యాసాలు

చిత్తూరు కల్చరల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో రెండు రోజుల నడివీధి గంగ జాతర బుధవారం కోలాహల వాతావరణంలో ముగిసింది.గంగమ్మకు జాతర వంశపారంపర్య ధర్మకర్తలు సీకేబాబు కుటుంబసభ్యులు, హేమంత్‌కుమార్‌, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ స్థానిక పొన్నియమ్మ గుడిలో అమ్మవారి గజమాలకు, సారెకు పూజలు నిర్వహించారు. మేళతాళాలతో ఊరేగింపుగా బజారు వీధిలో కొలువుదీరిన నడివీధి గంగమ్మకు సమర్పించి నిమజ్జన ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.కొబ్బరికాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించారు.స్థానిక కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వరాలయం నుంచి ఓంశక్తి భక్తులు శరీరాలపై శూలాలు గుచ్చుకుని ఆటోలు, ట్యాక్సీలు, లారీలు, ట్రాక్టర్లు, పొక్లయినర్లు లాగుతూ ప్రభుత్వాస్పత్రి, మార్కెట్‌ చౌక్‌, చర్చివీధి, హైరోడ్డులోని మాక్స్‌ వద్దకు రాగా, అదే సమయానికి బజారు వీధి, శేషాపిరాన్‌ వీఽధుల మీదుగా నడివీధి గంగమ్మను ఉత్సవ నిర్వాహకులు తీసుకువచ్చారు. ఓం శక్తి భక్తులు అమ్మవారికి పూలమాల సమర్పించారు.అనంతరం గంగమ్మను ఊరేగింపుగా కట్టమంచి చెరువులోకి తీసుకెళ్లి జలాధివాసం చేశారు.ఉత్సవ నిర్వాహకులు వెంకటేష్‌, గుణశేఖర్‌, వేమారెడ్డి, ఆర్‌ఎస్‌ఎల్‌ఎస్‌ సుబ్బు, సీఆర్సీ రవి, చుడా చైర్మన్‌ కటారి మేమలత, టీడీపీ నాయకులు దొరబాబు, చంద్రప్రకాష్‌, వసంత్‌కుమార్‌, కాజూరు బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 01:54 AM