మామిడి రైతులు నష్టపోకుండా చర్యలు
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:24 AM
మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు.
కలెక్టర్ సుమిత్‌కుమార్
గుడిపాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. మంగళవారం గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్ మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద బారులు తీరిన మామిడి ట్రాక్టర్ల వద్ద రైతులతో మాట్లాడారు. మామిడి తోటల్లో ఎంత కాపు మిగిలి ఉందని అడిగి తెలుసుకున్నారు. రైతుకు చెందిన చివరి మామిడి కాయను అమ్మేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని చెప్పారు. ఫ్యాక్టరీల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే తహసీల్దార్ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. రోడ్డు పక్కన ట్రాక్టర్లు, లారీలు నిలిపినపుడు ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక ఎస్‌ఐకి ఫిర్యాదు చేయాలన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 07:29 AM