ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దిగుబడి పెరగడంతోనే మామిడి అమ్మకాలకు ఇబ్బందులు

ABN, Publish Date - Jul 10 , 2025 | 02:11 AM

రైతుల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో గతేడాది మామిడి 2.5 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ ఏడాది 6.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొతాపురి కిలోకి రూ.12 మద్దతు ధర ప్రకటిస్తూ అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.4లు ఇస్తోందని, మిగిలిన రూ.8లు గుజ్జు పరిశ్రమల ద్వారా రైతులకు ఇప్పించే ప్రయత్నం జిల్లా యంత్రాంగం చేస్తోందన్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కేంద్ర వాటాగా రూ.130 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖరాసినట్లు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 3.08 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడిని ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల ద్వారా చేపట్టినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్‌ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 టన్నులు కొనుగోళ్ళు చేసినట్లు తెలిపారు. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్‌ టన్నులు మామిడిని ఇతర రాష్ట్రాలకు విక్రయించినట్లు తెలిపారు. మొత్తంగా 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయగా, మామిడి గుజ్జు పరిశ్రమలకు పల్ఫ్‌పై 12 శాతం జీఎ్‌సటీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

-అయినా రైతులను ఆదుకుంటున్నాం

  • ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిత్తూరు సెంట్రల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో గతేడాది మామిడి 2.5 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ ఏడాది 6.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొతాపురి కిలోకి రూ.12 మద్దతు ధర ప్రకటిస్తూ అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.4లు ఇస్తోందని, మిగిలిన రూ.8లు గుజ్జు పరిశ్రమల ద్వారా రైతులకు ఇప్పించే ప్రయత్నం జిల్లా యంత్రాంగం చేస్తోందన్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కేంద్ర వాటాగా రూ.130 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖరాసినట్లు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు 3.08 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడిని ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల ద్వారా చేపట్టినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్‌ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 టన్నులు కొనుగోళ్ళు చేసినట్లు తెలిపారు. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్‌ టన్నులు మామిడిని ఇతర రాష్ట్రాలకు విక్రయించినట్లు తెలిపారు. మొత్తంగా 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయగా, మామిడి గుజ్జు పరిశ్రమలకు పల్ఫ్‌పై 12 శాతం జీఎ్‌సటీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 02:11 AM