ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యాక్టరీలన్నీ తెరిస్తేనే మామిడి రైతులకు ప్రయోజనం

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:38 AM

తోతాపురి రకం మామిడి కాయలకు ధర రావాలంటే జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలన్నీ పనిచేయడమే మార్గంగా కనిపిస్తోంది.

ఆర్‌ఎంఎం ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

ఫ్యాక్టరీల వద్ద నిరసనల పర్వం

ర్యాంపుల్లోనూ పెరిగిన నిఘా

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : తోతాపురి రకం మామిడి కాయలకు ధర రావాలంటే జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలన్నీ పనిచేయడమే మార్గంగా కనిపిస్తోంది. సీజన్‌ ప్రారంభమై పంట చేతికి వచ్చి పక్షం రోజులు గడుస్తున్నా, పరిశ్రమలన్నీ పనిచేయకపోవడం, తెరుచుకున్న పరిశ్రమల యాజమాన్యాలపై మామిడి కొనుగోళ్లకు రైతులు ఒత్తిడి పెంచడం తదితర పరిణామాలతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. తోతాపురికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కాకుండా పోవడం రైతుల్లో నిరాశను పెంచుతోంది. జిల్లాలో 39 గుజ్జు పరిశ్రమలుండగా, 15 ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మరో 14 ఫ్యాక్టరీలు అటూఇటుగా పనిచేస్తున్నాయి. 6 ఫ్యాక్టరీలు తెరచుకోలేదు. ఫ్యాక్టరీలన్నీ తెరిపించే క్రమంలో అధికార యంత్రాంగం ఆయా ఫ్యాక్టరీల్లోని సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాయి. .

సామర్థ్యానికి మించి కొనలేం

ఒక్కో ఫ్యాక్టరీ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 150 టన్నులు కాగా, 30 ట్రాక్టర్ల మామిడి కాయలు అవసరం . ఇందుకు భిన్నంగా ఒక్కో ఫ్యాక్టరీకి 50 ట్రాక్టర్లకు పైగా మామిడి కాయలను తరలిస్తుండడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నాయి. చిత్తూరు సమీపంలోని ఆర్‌ఎంఎం ఫ్యాక్టరీ యాజమాన్యం ఈనెల 30వ తేదీ వరకు రైతులకు టోకెన్లు ఇచ్చింది. ఇదే బాటలో బంగారుపాళ్యం సమీపంలోని నలగాంపల్లె సన్‌గోల్డు ఫ్యాక్టరీ యాజమాన్యం టోకెన్లు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మామిడి కాయలను తీసుకువచ్చిన రైతులు వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రెండు ఫ్యాక్టరీల ముందు ధర్నాకు దిగారు. స్టాక్‌ అధికంగా కొనుగోలు చేసినందున రెండు రోజుల పాటు మామిడిని తేవద్దంటూ గంగాధరనెల్లూరులోని జైన్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు సూచించింది.

స్థిరంగా టేబుల్‌ వెరైటీల ధరలు

ఇటు ఫ్యాక్టరీల్లో, అటు మండీల్లో మామిడి ధరలు ఒకే రకంగా కొనసాగుతున్నాయి. గుజ్జు పరిశ్రమలు తోతాపురి టన్ను రూ.5వేల నుంచి రూ.6 వేల మధ్య కొనుగోలు చేస్తున్నాయి. ఇక చిత్తూరు, బంగారుపాళ్యం మండీలకు రోజువారీ వచ్చే టేబుల్‌ వెరైటీ మామిడి ధరలు వారం రోజులుగా స్థిరంగా వున్నాయి. బేనీషా రూ.20, బేనీషా (కలర్‌) రూ.25, కాలేపాడు రూ.25, మల్లిక రూ.30, హిమామ్‌ పసంద్‌ రూ.70, మల్గూబా రూ.40, తోతాపురి (లైనింగ్‌ కలర్‌) రూ.13 పలుకుతున్నాయి.

ర్యాంపుల వద్ద పెరిగిన నిఘా

జిల్లాలో 39 ర్యాంపులు ఉండగా, మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఇప్పటి వరకు 25 ర్యాంపులకు లైసెన్స్‌లు అందజేశారు. వీటిలో మామిడి కొనుగోళ్లు ప్రారంభించడంతో అధికారులు నిఘా పెంచారు. ర్యాంపుల వద్ద నాణ్యమైన కాయలకే తప్ప మిగిలిన వాటికి ధరలు లేకపోవడంతో తాము తెచ్చిన కాయలు అమ్ముడుపోతే చాలనే దృష్టితో గిట్టుబాటు ధర అటూ, ఇటుగా అమ్మేయడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 01:38 AM