నేటి నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:04 AM
జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు జేసీ శుభం బన్సల్ బుధవారం తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యంతో గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు జేసీ శుభం బన్సల్ బుధవారం తెలిపారు. 25 కిలోల ప్యాకెట్ల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని 1,867 పాఠశాలలకు 7,614 ప్యాకెట్లు, వసతిగృహాలకు 9,400 ప్యాకెట్లు, తిరుపతిలోని ఇస్కాన్ ద్వారా మధ్యాహ్న భోజనం పథకానికి 3,377 ప్యాకెట్లు, అక్షయపాత్ర ద్వారా 1,353 చొప్పన మొత్తం 21,744 ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి ప్యాకెట్‌పై క్యూఆర్‌కోడ్ అమలు చేసినట్లు చెప్పారు.
Updated Date - Jun 12 , 2025 | 01:04 AM