నేడు సత్యవేడుకు లోకేశ్
ABN, Publish Date - May 07 , 2025 | 01:05 AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధ, గురువారాల్లో సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 3.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన 5.10 గంటలకు సత్యవేడుకు వస్తారు. వీఎంకే కల్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన శిబిరంలో జరిగే టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. గతంలో పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ, సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాల నిర్వహణలో ముందు వరుసలో నిలిచిన టీడీపీ కార్యకర్తలను సన్మానిస్తారు. 6.30 నుంచి 8 గంటల వరకు నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారు. రాత్రి సత్యవేడులోనే బస చేస్తారు. తిరిగి గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు శ్రీసిటీకి చేరుకుంటారు. అక్కడ ఎల్‌జీ పరిశ్రమ భూమిపూజలో పాల్గొంటారు. రోడ్డు మార్గం ద్వారా 2.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు వెళతారు.
సత్యవేడు, మే 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధ, గురువారాల్లో సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 3.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన 5.10 గంటలకు సత్యవేడుకు వస్తారు. వీఎంకే కల్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన శిబిరంలో జరిగే టీడీపీ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. గతంలో పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ, సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాల నిర్వహణలో ముందు వరుసలో నిలిచిన టీడీపీ కార్యకర్తలను సన్మానిస్తారు. 6.30 నుంచి 8 గంటల వరకు నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారు. రాత్రి సత్యవేడులోనే బస చేస్తారు. తిరిగి గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు శ్రీసిటీకి చేరుకుంటారు. అక్కడ ఎల్‌జీ పరిశ్రమ భూమిపూజలో పాల్గొంటారు. రోడ్డు మార్గం ద్వారా 2.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు వెళతారు.
Updated Date - May 07 , 2025 | 01:05 AM