ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇలా.. జాతిపిత

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:07 AM

గ్రామంలో 60 ఏళ్లపాటు ఠీవిగా ఉన్న జాతిపిత విగ్రహం.. గురువారం సాయంత్రం ఇలా శ్మశానం వద్ద పడుంది. అధికారుల అనుమతి లేకుండా కూలగొట్టి.. భవన వ్యర్థాల మధ్య పడేయడంపై గ్రామస్తులు ఆవేదన.. ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమతిలేకనే గాంధీ విగ్రహం కూల్చివేత

శ్మశానంలో పడేసిన ఛోటా నేతలు

గ్రామంలో 60 ఏళ్లపాటు ఠీవిగా ఉన్న జాతిపిత విగ్రహం.. గురువారం సాయంత్రం ఇలా శ్మశానం వద్ద పడుంది. అధికారుల అనుమతి లేకుండా కూలగొట్టి.. భవన వ్యర్థాల మధ్య పడేయడంపై గ్రామస్తులు ఆవేదన.. ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట మండలం పుదూరులో ఆరు దశాబ్దాల నాటి గాంధీ విగ్రహం స్వల్పంగా శిథిలావస్థకు చేరింది. దీంతో కొత్త విగ్రహం ఏర్పాటుకు ఈ నెల 19న పంచాయతీలో తీర్మానించారు. అంతే.. గురువారం మధ్యాహ్నం కొందరు చోటా నాయకులు గాంధీ విగ్రహాన్ని పగలగొట్టి.. శ్మశానంలో భవన నిర్మాణ శిథిలాల వద్ద పడేశారు. సాయంత్రం కొందరు చూసేసరికి గాంధీ విగ్రహం స్థానంలో చదును చేసేసి ఉంది. విగ్రహం ఎక్కడ ఉందంటూ ఆరా తీయగా.. శ్మశానం వద్ద కనిపించింది. ‘ఈ నెల 19న గాంధీ విగ్రహం కొత్తగా ఏర్పాటు చేసేందుకు మాత్రమే పంచాయతీ తీర్మానం చేసింది. విగ్రహం పడగొట్టడం కోసం మా అనుమతులు తీసుకోలేదు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపాం’ అని పంచాయతీ కార్యదర్శి జి.వెంకటరావు తెలిపారు.

- నాయుడుపేట టౌన్‌

Updated Date - Jul 25 , 2025 | 02:07 AM