వడమాలపేటలో పర్యాటక శాఖకు భూమి కేటాయింపు
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:32 AM
వడమాలపేట మండలంలో పర్యాటక శాఖకు భూమి కేటాయించేందుకు, తిరుపతిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణ సంస్థకు రాయితీలు ఇచ్చేందుకు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అమరావతిలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాల్లో జిల్లాకు సంబంధించి ఈ మూడు అంశాలున్నాయి.
- తిరుపతిలో పావని ఫైవ్‌స్టార్ హోటల్‌కు రాయితీలు
- మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి
- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
తిరుపతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): వడమాలపేట మండలంలో పర్యాటక శాఖకు భూమి కేటాయించేందుకు, తిరుపతిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణ సంస్థకు రాయితీలు ఇచ్చేందుకు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అమరావతిలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాల్లో జిల్లాకు సంబంధించి ఈ మూడు అంశాలున్నాయి.
- వడమాలపేట మండలం ఎస్వీపురం పరిధిలో టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి పరిచేందుకు ఏపీ టూరిజం అథారిటీకి భూమి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎస్వీపురం సర్వే నంబరు 428-2లో 30 సెంట్లు, సర్వే నంబరు 428-3లో 12.40 ఎకరాలు చొప్పున 12.70 ఎకరాలను ఏపీ టూరిజం అఽథారిటీకి ఉచితంగా కేటాయించే ఈ ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించింది. ఉచితంగా బదిలీ చేసేందుకు అంగీకారం తెలిపింది.
ఫ తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్న మెస్సర్స్ పావని హోటల్స్ సంస్థకు అవసరమైన రాయితీలు ఇవ్వాలంటూ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ఈనెల 19వ తేదీన తీసుకున్న నిర్ణయంపైనా మంత్రివర్గం సమీక్షించింది. ఆపై రాయితీలు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ ఫైవ్ స్టార్ ఏర్పాటు వల్ల 300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఫ జిల్లాలో పాలు సేకరించి వాటిని ప్రాసెస్ చేసే యూనిట్ ఏర్పాటు చేయడానికి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గం అనుమతించింది. ఈ నిర్ణయాలు కూడా జిల్లాలో పర్యాటక రంగానికి ఊతం కలిగించేలా
Updated Date - Jun 25 , 2025 | 01:33 AM