కడపజిల్లా సర్పంచి అరెస్టు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:56 AM
వైసీపీ ప్రభుత్వంలో.. అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో కడప జిల్లా ఉప్పరాండ్లపల్లికి చెందిన సర్పంచ్ షేక్ అష్రద్ అయూబ్‌బాషాను తిరుపతి సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన పర్యవసానం
తిరుపతి(నేరవిభాగం), జూలై 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో.. అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో కడప జిల్లా ఉప్పరాండ్లపల్లికి చెందిన సర్పంచ్ షేక్ అష్రద్ అయూబ్‌బాషాను తిరుపతి సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చక్రాయపేట మండలం ఉప్పరాండ్లపల్లికి చెందిన సర్పంచి షేక్ ఆష్రద్ అయూబ్ బాషా వైసీపీకి విధేయుడు. 2024లో తన ఫేస్‌బుక్ ఖాతాలో చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టాడు. అప్పట్లో చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తిరుపతిలో ఉన్నట్లు సీఐడీ పోలీసులకు సమాచారం వచ్చింది. అతడి సెల్‌ఫోను నెంబరును ట్రాక్ చేసి అరెస్టు చేశారు. గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐడీ సీఐ రంగస్వామి చెప్పారు.
Updated Date - Jul 16 , 2025 | 01:56 AM