ఉప్మాలో జెర్రి
ABN, Publish Date - Jul 04 , 2025 | 02:00 AM
శ్రీకాళహస్తి పట్టణం తెలుగుగంగ కాలనీలోని బీసీ బాలికల వసతిగృహంలో ఉప్మాలో జెర్రి రావడంతో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యరు. వివరాలిలా ఉన్నాయి. ఈ హాస్టల్‌లో మెనూ ప్రకారం గురువారం ఉదయం వార్డెన్ శ్రీలక్ష్మి ఉప్మా చేయించారు. 65మంది విద్యార్థినులతో పాటు ఆమె తిన్నారు. పిల్లలు విద్యాసంస్థలకు వెళ్లారు. తొట్టంబేడు బాలికల జూనియర్ కళాశాలలో ప్రార్థన సమయంలో ఫస్టియర్ విద్యార్థిని యోష్ని కళ్లు తిరిగి పడిపోయింది. సిబ్బంది ఆమెనులేపి ఆరా తీశారు. ఉప్మాలో జెర్రీ కనిపించిందని, దీంతో వాంతుల లక్షణాలతో కళ్లు తిరిగి పడిపోయానని చెప్పింది. అదే గదిలోని కుమారి, జ్యోత్స్న కూడా తాము అదే ఉప్మా తినడం వల్ల కడుపు నొప్పిగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్‌కు వివరించారు. దాంతో ఈ ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత
వార్డెన్, అటెండర్ సస్పెన్షన్
శ్రీకాళహస్తి, జూలై 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి పట్టణం తెలుగుగంగ కాలనీలోని బీసీ బాలికల వసతిగృహంలో ఉప్మాలో జెర్రి రావడంతో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యరు. వివరాలిలా ఉన్నాయి. ఈ హాస్టల్‌లో మెనూ ప్రకారం గురువారం ఉదయం వార్డెన్ శ్రీలక్ష్మి ఉప్మా చేయించారు. 65మంది విద్యార్థినులతో పాటు ఆమె తిన్నారు. పిల్లలు విద్యాసంస్థలకు వెళ్లారు. తొట్టంబేడు బాలికల జూనియర్ కళాశాలలో ప్రార్థన సమయంలో ఫస్టియర్ విద్యార్థిని యోష్ని కళ్లు తిరిగి పడిపోయింది. సిబ్బంది ఆమెనులేపి ఆరా తీశారు. ఉప్మాలో జెర్రీ కనిపించిందని, దీంతో వాంతుల లక్షణాలతో కళ్లు తిరిగి పడిపోయానని చెప్పింది. అదే గదిలోని కుమారి, జ్యోత్స్న కూడా తాము అదే ఉప్మా తినడం వల్ల కడుపు నొప్పిగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్‌కు వివరించారు. దాంతో ఈ ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి వీరిని పరామర్శించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని కలుషిత ఆహారంపై వార్డెన్ శ్రీలక్ష్మిని ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడారు. యోషినిని ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పుడు దారిలో ఒకసారి వాంతి చేసుకున్నట్లుగా విద్యార్థులు చెప్పారని ఆస్పత్రి సూపరింటెంండెంట్ మణి తెలిపారు. ఆస్పత్రిలో చేరాక వాంతులు రాలేదన్నారు. సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచుకుని డిశ్చార్జి చేస్తామన్నారు. ఉప్మాలో జెర్రి రావడంపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా కోరారు. హాస్టల్ పైకప్పు పెంకుల నుంచి జర్పి పడి ఉండొచ్చని వంట సిబ్బంది విచారణ అధికారులకు తెలిపారు. అనంతరం వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేశారు. అటెండర్‌గా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగిని అంకమ్మను తాత్కాలికంగా విధుల నుంచి బహిష్కరించారు. తొట్టంబేడు హాస్టల్.. బీసీ హాస్టల్‌కు ఇన్‌ఛార్జి వార్డెన్‌గా విజయను నియమించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి, జనసేన ఇన్‌ఛార్జి వినుత పరామర్శించారు.
Updated Date - Jul 04 , 2025 | 02:00 AM