ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పలమనేరు ఎలిఫెంట్‌ క్యాంపునకు జయంత్‌, వినాయక్‌

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:12 AM

రామకుప్పం మండలం ననియాల కౌండిన్య ఎలిఫెంట్‌ క్యాంపులోని కుంకీలు (శిక్షణ పొందిన ఏనుగులు) జయంత్‌, వినాయక్‌లను ఆదివారం పలమనేరు ఎలిఫెంట్‌ క్యాంపునకు తరలించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అటవీ సమీప పొలాలు, జనావాసాలపై గజదాడుల పరంపర కొనసాగుతుండటంతో కుంకీల సహకారంతో అడవి ఏనుగులను అడవులకే పరిమిత చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలమనేరులో ఎలిఫెంట్‌ క్యాంపు ఏర్పాటు చేసింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు కుంకీలను ప్రభుత్వం పలమనేరు క్యాంపునకు తీసుకువచ్చింది. వాటికి అదనపు శిక్షణ ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికోసం ననియాలలో ఇచ్చిన శిక్షణలో ఆరితేరిన కుంకీలు జయంత్‌, వినాయక్‌లను ఆదివారం పలమనేరుకు తరలించారు. కుంకీలతో పాటు నలుగురు మావటీలు అక్కడి నాలుగు కుంకీలకు మరింత శిక్షణ ఇస్తారని అటవీ అధికారులు తెలిపారు.

పలమనేరులోని ఎలిఫెంట్‌ క్యాంపు వద్దకొచ్చిన ఏనుగులు

రామకుప్పం/పలమనేరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం ననియాల కౌండిన్య ఎలిఫెంట్‌ క్యాంపులోని కుంకీలు (శిక్షణ పొందిన ఏనుగులు) జయంత్‌, వినాయక్‌లను ఆదివారం పలమనేరు ఎలిఫెంట్‌ క్యాంపునకు తరలించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అటవీ సమీప పొలాలు, జనావాసాలపై గజదాడుల పరంపర కొనసాగుతుండటంతో కుంకీల సహకారంతో అడవి ఏనుగులను అడవులకే పరిమిత చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలమనేరులో ఎలిఫెంట్‌ క్యాంపు ఏర్పాటు చేసింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు కుంకీలను ప్రభుత్వం పలమనేరు క్యాంపునకు తీసుకువచ్చింది. వాటికి అదనపు శిక్షణ ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికోసం ననియాలలో ఇచ్చిన శిక్షణలో ఆరితేరిన కుంకీలు జయంత్‌, వినాయక్‌లను ఆదివారం పలమనేరుకు తరలించారు. కుంకీలతో పాటు నలుగురు మావటీలు అక్కడి నాలుగు కుంకీలకు మరింత శిక్షణ ఇస్తారని అటవీ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 02:12 AM