ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీటీడీ తులాభారంలోనూ అక్రమాలు

ABN, Publish Date - May 20 , 2025 | 02:19 AM

‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి తులాభారంలోనూ చాలా అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై విచారించి అక్రమార్కుల నిగ్గు తేల్చండి’ అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుపతిలో విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీ్‌ఫను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. తిరుమల తులాభారం వద్ద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు లక్షలాది రూపాయలు తీసుకుని బయటకు వచ్చారన్నారు. తులాభారంలో జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్సు అధికారులు బయటపెట్టినా, టీటీడీ ఉన్నతాధికారులు విచారణ జరపకుండా అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భక్తులు సమర్పించిన కానుకలను సగం లెక్క చూపి సగం దొంగతనంగా తీసుకెళ్లారని పలువురు భక్తులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. తక్షణమే వాటిపై విచారించి కేసు నమోదు చేయాలని విజిలెన్సు ఎస్పీని కోరామన్నారు.

విజిలెన్స్‌ ఎస్పీకి వినతిపత్రం అందిస్తున్న టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి
  • విచారించి నిగ్గు తేల్చండి

  • విజిలెన్సు ఎస్పీకి బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి విజ్ఞప్తి

తిరుపతి(నేరవిభాగం), మే 19 (ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి తులాభారంలోనూ చాలా అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై విచారించి అక్రమార్కుల నిగ్గు తేల్చండి’ అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తిరుపతిలో విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీ్‌ఫను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. తిరుమల తులాభారం వద్ద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు లక్షలాది రూపాయలు తీసుకుని బయటకు వచ్చారన్నారు. తులాభారంలో జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్సు అధికారులు బయటపెట్టినా, టీటీడీ ఉన్నతాధికారులు విచారణ జరపకుండా అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భక్తులు సమర్పించిన కానుకలను సగం లెక్క చూపి సగం దొంగతనంగా తీసుకెళ్లారని పలువురు భక్తులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. తక్షణమే వాటిపై విచారించి కేసు నమోదు చేయాలని విజిలెన్సు ఎస్పీని కోరామన్నారు. పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగి విషయంలో చెట్ల కింద పంచాయితీ చేసినట్లుగా చేసి భేషరతుగా విడిచి పెట్టారన్నారు. అదే విధంగా తులాభారంలో దొరికిన దొంగలపైనా కేసు నమోదు చేయకుండా విడిచి పెట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే శ్రీవారి ఆభరణాలను సైతం దొంగలించారేమో అని అనిపిస్తుందన్నారు. తులాభారంలో జరిగిన అవినీతి అక్రమాలపై టీటీడీ చైర్మన్‌, ముఖ్యమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్ళి అవినీతిపరులకు శిక్ష పడేలా చేస్తానన్నారు. అక్రమంగా దోచుకున్న శ్రీవారి ఖజానాతో టీటీడీ దొంగలు తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. కాగా, 2019-24 మధ్య తిరుమల పరకామణి, నెయ్యి కల్తీ, శ్రీవారి శేషవస్త్రాలను సైతం తస్కరించి అమ్ముకోవడం తదితరాలపై దర్యాప్తు చేయాలని భానుప్రకా్‌షరెడ్డి డిమాండు చేశారు.

Updated Date - May 20 , 2025 | 02:19 AM