ఏడుగురు మున్సిపల్ ఇంజనీర్ల విచారణ
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:49 AM
పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో నాసిరకం పనులు జరగడంపై ఏడుగురు ఇంజనీరింగ్ అధికారులపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో
నాసిరకం పనులపై ఆరోపణలు
-విచారణాధికారిగా పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రామ్మోహన్‌రెడ్డి
పుంగనూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటీల్లో నాసిరకం పనులు జరగడంపై ఏడుగురు ఇంజనీరింగ్ అధికారులపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అనంతపురం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ ఆర్.రామ్మోహన్‌రెడ్డిని విచారించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేశ్‌కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి విచారణ నివేదికను మూడునెలల్లోపు ప్రభుత్వానికి ఆందజేయాలని ఆదేశించారు. మదనపల్లె మున్సిపల్ మాజీ డీఈఈ పీఎస్.మహేశ్, పుంగనూరు మున్సిపల్ మాజీ డీఈఈ ఎం.నారాయణస్వామి, రిటైర్డ్ డీఈఈ కేఏ.పద్మనాభరావు, మాజీ ఏఈలు ఎం.రవీంద్రరెడ్డి, బి.కృష్ణకుమార్, రిటైర్డ్ ఏఈ పి.సుబ్బరామయ్య, మదనపల్లె ఏఈ కె.గోపీనాథ్‌లపై వచ్చిన అభియోగాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 01:49 AM