ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభం

ABN, Publish Date - Apr 07 , 2025 | 01:12 AM

జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సోమవారం నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అన్ని యాజమాన్యానికి సంబంధించి 139 జూనియర్‌ కళాశాలల్లో 17 వేల నుంచి 20 వేల వరకు సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 29 ఉండగా, ఒకేషనల్‌ రెండు, ప్రైవేటు ఒకేషనల్‌ కళాశాలలు 5, హైస్కూల్‌ ప్లస్‌లు 24, కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలు 8, ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌, మోడల్‌ పాఠశాలలు ఏడు, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 59, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలలు 4 ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సెకండియర్‌ విద్యార్థులు పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఉచితంగా అందించామన్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు సైతం పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు చెప్పారు.

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సోమవారం నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అన్ని యాజమాన్యానికి సంబంధించి 139 జూనియర్‌ కళాశాలల్లో 17 వేల నుంచి 20 వేల వరకు సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 29 ఉండగా, ఒకేషనల్‌ రెండు, ప్రైవేటు ఒకేషనల్‌ కళాశాలలు 5, హైస్కూల్‌ ప్లస్‌లు 24, కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలు 8, ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌, మోడల్‌ పాఠశాలలు ఏడు, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 59, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలలు 4 ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సెకండియర్‌ విద్యార్థులు పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఉచితంగా అందించామన్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు సైతం పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 07 , 2025 | 01:12 AM