ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవిన్యూలో బదిలీలకు శ్రీకారం

ABN, Publish Date - May 23 , 2025 | 02:03 AM

రెవిన్యూశాఖలో బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీఅయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాస్థాయిలో జరుగనున్న ఈ బదిలీలకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు.

-అన్ని క్యాడర్లలోనూ స్థానచలనం

-నోడల్‌ అధికారిగా చిత్తూరు కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రెవిన్యూశాఖలో బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీఅయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాస్థాయిలో జరుగనున్న ఈ బదిలీలకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. తిరుపతి జిల్లా కలెక్టరు సభ్యుడిగా, చిత్తూరు డీఆర్వో మోహన్‌కుమార్‌ కన్వీనర్‌గా బదిలీల కమిటీకి నాయకత్వం వహిస్తారు.తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, వీఆర్వో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2లకు బదిలీలుంటాయి. ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగే వాటిని కలెక్టరేట్లకు మాత్రమే బదలాయిస్తారు.బదిలీ ప్రాంతంలో కలెక్టరేట్‌కు రిపోర్టు చేసుకున్న తర్వాత అక్కడి కలెక్టర్‌ మండలాల్లో పోస్టింగ్‌ ఇస్తారు. ప్రస్తుతం తిరుపతితో పోలిస్తే చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా స్థాయిలో చైర్మన్‌గా కలెక్టర్‌

చిత్తూరు జిల్లాస్థాయిలో బదిలీల కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సభ్యురాలిగా జేసీ విద్యాధరి, కన్వీనర్‌గా డీఆర్వో మోహన్‌ కుమార్‌ వ్యవహరిస్తారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలోనే తహసీల్దార్లు, వీఆర్వో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 అధికారులు, ఉద్యోగులకు పోస్టింగ్స్‌ ఇస్తారు.కొన్ని క్యాడర్లకు జేసీ విద్యాధరి చైర్మన్‌గా, డీఆర్వో మోహన్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో కులశేఖర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టులకు పోస్టింగ్‌ ఇస్తారు.ఈనెల 28వ తేదీ లోగా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి జూన్‌ 2వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది.

2వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి

బదిలీలకు సంబంధించి ఉద్యోగులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఉద్యోగి హోదా, పనిచేస్తున్న జిల్లా, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారు,ఐదేళ్ళలోపు సర్వీసు ఉన్నవారు బదిలీ కోరుకుంటే కారణాలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసులను పేర్కొంటూ జాబితా తయారుచేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి జూన్‌నెల 2వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేస్తాం. తాజా మార్గదర్శకాలతో కలెక్టరేట్‌లో బదిలీల కసరత్తు ప్రారంభించాం.

- మోహన్‌కుమార్‌, చిత్తూరు డీఆర్వో.

Updated Date - May 23 , 2025 | 02:03 AM