ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాణిపాకంలో బ్రహ్మోత్సవ పనులకు శ్రీకారం

ABN, Publish Date - Aug 01 , 2025 | 02:17 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈనెల 27వ తేదీనుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహోత్సవాలకు వరసిద్ధుడి ఆలయం ముస్తాబవుతోంది. గురువారం నుంచి ఆలయానికి రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి.

ప్రధాన ఆలయానికి రంగులు వేస్తున్న కార్మికులు

ఐరాల(కాణిపాకం), జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈనెల 27వ తేదీనుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహోత్సవాలకు వరసిద్ధుడి ఆలయం ముస్తాబవుతోంది. గురువారం నుంచి ఆలయానికి రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రధాన ఆలయ రాజగోపురానికి, సుపధ మండపానికి రంగులు వేస్తున్నారు. తర్వాత అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి, మణికంఠేశ్వరాలయాలతోపాటు గణేష్‌ సదన్‌,వినాయక సదన్‌కు రంగులు వేయనున్నారు. దీంతోపాటు ప్రధాన ఆలయం నుంచి అగరంపల్లె వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నట్లు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 02:17 AM