‘స్థానిక సంస్థల’ పరిపుష్టికి నిధులు పెంచండి
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:56 AM
రాష్ట్ర విభజనతో నష్టపోయాం. కేంద్ర నిధులు మరింత పెంచి స్థానిక సంస్థలను ఆదుకోండి’ అంటూ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియాకు పలువురు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్యంలో సభ్యులు అన్నే జార్జి మఽథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృతచ, ఆదిత్య పంత్, జ్యోతి నాగర్కోటి, అభయ్‌మీనన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘కేంద్ర సహకారంతో సోలార్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయండి. తద్వారా మున్సిపాలిటీల్లో విద్యుత్ భారం తగ్గుతుంది. ఆ నిధులను మౌలిక వసతులకు వినియోగిస్తాం’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఏటా ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు మరింత పెంచాలని సత్యవేడు జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
-16వ ఆర్థిక సంఘానికి
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర విభజనతో నష్టపోయాం. కేంద్ర నిధులు మరింత పెంచి స్థానిక సంస్థలను ఆదుకోండి’ అంటూ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియాకు పలువురు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్యంలో సభ్యులు అన్నే జార్జి మఽథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృతచ, ఆదిత్య పంత్, జ్యోతి నాగర్కోటి, అభయ్‌మీనన్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘కేంద్ర సహకారంతో సోలార్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయండి. తద్వారా మున్సిపాలిటీల్లో విద్యుత్ భారం తగ్గుతుంది. ఆ నిధులను మౌలిక వసతులకు వినియోగిస్తాం’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఏటా ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు మరింత పెంచాలని సత్యవేడు జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతల్లో పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్ధికసంఘం నిధులు పెంచితే స్థానిక సంస్థలు ఆర్ధికంగా బలోపేతమవుతాయని తిరుపతి రూరల్ చెర్లోపల్లి సర్పంచ్ సుభాషిణి అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించడం ద్వారా వచ్చే ఆదాయంతో పల్లెలను అభివృద్ధి చేసుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీపీ జ్యోత్స్న అన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు ఈసారి వచ్చే ఆర్ధిక సంఘం నిధులు పెంచాలని పంచాయతీ, మున్సిపాలిటీ, నగరకపాలకసంస్థ కార్యాలయాలకు సోలార్ ప్రాజెక్టులకు నిధులు మంజూరుచేయాలని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రత్నకుమారి ఆర్థిక సంఘాన్ని కోరారు. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయలను కమిషన్ పరిశీలిస్తుందని 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి 33 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
Updated Date - Apr 18 , 2025 | 12:56 AM