ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అండగా నిలుస్తారనుకుంటే..!

ABN, Publish Date - Aug 04 , 2025 | 01:44 AM

వాళ్లది నిరుపేద కుటుంబం. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఉద్యోగులై కుటుంబానికి అండగా నిలుస్తారనుకున్న ఇద్దరు యువకులు.. విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. అక్కరపాక వద్ద ప్రమాద మృతులు.. గాయపడిన యువకుడిది నాయుడుపేట మండలం పుదూరు. ఆదివారం సాయంత్రం రెండు మృతదేహాలు గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.

గణేష్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబీకులు, బంధువులు

నాయుడుపేట టౌన్‌, ఆంధ్రజ్యోతి

వాళ్లది నిరుపేద కుటుంబం. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఉద్యోగులై కుటుంబానికి అండగా నిలుస్తారనుకున్న ఇద్దరు యువకులు.. విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. అక్కరపాక వద్ద ప్రమాద మృతులు.. గాయపడిన యువకుడిది నాయుడుపేట మండలం పుదూరు. ఆదివారం సాయంత్రం రెండు మృతదేహాలు గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.

ఫ బాలకృష్ణ, విజయమ్మ దంపతుల కుమారుడు భవానీ ప్రసాద్‌. ఇతడి సోదరి జ్వాలా. బాలకృష్ణ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించడంతో పాటు ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. ఈ సంవత్సరంతో కుమారుడి బీటెక్‌ పూర్తయితే.. ఉద్యోగంలో చేరి అండగా నిలుస్తాడని ఆ కుటుంబం భావించింది. ఇంతలో ఈ ప్రమాదం వారి కలలను ఛిద్రం చేసింది.

  • ఇక, కుమారుడు గణే్‌సతో కలిసి సుబ్బమ్మ నాలుగేళ్ల కిందట శ్రీకాళహస్తి అగ్రహారం నుంచి పుదూరుకు వచ్చారు. కూలి పనులు చేసుకొంటూ కొడుకుని చదివిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడి మరణం ఆమెను కుంగదీసింది.

  • గాయపడిన అనిల్‌దీ పేద కుటుంబమే. ఇతడి తండ్రి హోటల్‌లో పనిచేస్తున్నారు. అదే హోటల్‌లో తనూ పనికి చేరాడు అనిల్‌. ఇంతలో తీవ్ర గాయాలతో ఆస్పత్రికి చేరారు. ఆస్పత్రి ఖర్చులు భరించడం ఆ కుటుంబానికి తలకుమించిన భారమవుతోంది.

Updated Date - Aug 04 , 2025 | 01:44 AM