ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించండి: కలెక్టర్‌

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:09 AM

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని.. వారు ఏ రంగంలో రాణించగలరో గుర్తించి అందుకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి టౌన్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో నైపుణ్యాన్ని.. వారు ఏ రంగంలో రాణించగలరో గుర్తించి అందుకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. వెంకటగిరిలోని మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ తులసీజ్యోతి ఆధ్వర్యంలో గురువారం జరిగిన పేరెంట్స్‌ - టీచర్స్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు బట్టీపట్టే విధానం నుంచి గుణాత్యక విద్య వైపు మళ్లేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం నాణ్యమైన యూనిఫాం, షూ, బ్యాగ్‌, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తోందన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. తల్లిదండ్రులకు మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహించి విజేతలను అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీపీ తనూజా, డీఈవో కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, సీఐ రమణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 02:09 AM