ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి కేసులో భార్యాభర్తల అరెస్టు

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:44 AM

ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో డీఎస్పీ అజీజ్‌ మీడియాకు గురువారం వివరాలను తెలిపారు.

నిందితుల వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

నగరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో డీఎస్పీ అజీజ్‌ మీడియాకు గురువారం వివరాలను తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో గంజాయిపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఏడు గంటలకు జరిగిన దాడుల్లో నగరి మండలంలోని ఓజీ కుప్పంలోని మారియమ్మ గుడి వద్ద గంజాయి విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన గోగుల శామ్సన్‌ అనే రాజు(32), ఆయన భార్య ఊర్మిళ(32)లను నగరి సీఐ విక్రమ్‌ ఆధ్వర్యంలోని బృందం పట్టుకుంది. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశారు. కాగా, శామ్సన్‌పై ఇదే పోలీ్‌సస్టేషన్‌లో గతంలో రెండు గంజాయి కేసులు నమోదవగా, బెయిల్‌పై బయటకు వచ్చాడు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 01:44 AM