ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హెచ్‌ఎం, టీచర్లకు షోకాజ్‌

ABN, Publish Date - Jul 02 , 2025 | 02:16 AM

తిరుపతి అర్బన్‌ ముత్యాలరెడ్డి పల్లిలోని మోడల్‌ ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో కుమార్‌

తిరుపతి(విద్య), జూలై 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అర్బన్‌ ముత్యాలరెడ్డి పల్లిలోని మోడల్‌ ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పలు అంశాలకు సంబంధించి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తించలేదని గుర్తించినట్టు డీఈవో తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని, సంఖ్యను పెంచలేకపోయారని పేర్కొన్నారు. ఒకటో తరగతి విద్యార్థుల వివరాలను యుడై్‌సలో నమోదు చేయలేదని చెప్పారు. తరగతుల వారీగా బోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు హెచ్‌ఎం విధులు కేటాయించలేదని, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యతలనూ అప్పగించలేదన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 02:16 AM