ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మను వేధిస్తున్నాడని నాన్నను చంపేశాడు

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:51 AM

మద్యం సేవించి భార్యను తరచూ వేధించడంతో పాటు కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్న తండ్రిని ఆయన కుమారుడే నరికి చంపాడు. తల్లిని చంపడానికి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే అదే కత్తిని తీసుకుని తండ్రిని హతమార్చాడు.

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి భార్యను తరచూ వేధించడంతో పాటు కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్న తండ్రిని ఆయన కుమారుడే నరికి చంపాడు. తల్లిని చంపడానికి కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే అదే కత్తిని తీసుకుని తండ్రిని హతమార్చాడు.చిత్తూరు టూ టౌన్‌ ఇన్‌ఛార్జి సీఐ మహేశ్వర కథనం మేరకు... చిత్తూరు నగరం తేనబండ రోడ్డులో ఉన్న లెనిన్‌నగర్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేసే వెంకటరెడ్డి(54) కుటుంబంతో నివాసముంటున్నాడు. భార్య సరస్వతిపై అనుమానంతో తరచూ మద్యం సేవించి ఘర్షణ పడుతుండేవాడు.పుట్టింటి నుంచీ డబ్బులు తీసుకురావాలంటూ వేధించేవాడు. గురువారం కూడా సరస్వతితో ఘర్షణ పడ్డ వెంకటరెడ్డి కత్తితో నరకడానికి ప్రయత్నించాడు.ఎక్కడ తల్లిని చంపేస్తాడేమోననే భయంతో రెండో కుమారుడు సోమశేఖర రెడ్డి అదే కత్తి లాక్కుని తండ్రి మెడపై నరికాడు. దీంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే మరణించడం చూసి పరారయ్యాడు. డీఎస్పీ సాయిఽనాధ్‌, సీఐ మహేశ్వర సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వెంకటరెడ్డి భార్య సరస్వతమ్మ ఫిర్యాదు మేరకు సోమశేఖర రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 13 , 2025 | 01:51 AM