ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పద్మావతి ఆలయ డిప్యూటీఈవోగా హరీంధ్రనాథ్‌

ABN, Publish Date - May 12 , 2025 | 01:45 AM

తిరుమల రిసెప్షన్‌ డిప్యూటీఈవో ఆర్‌2గా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈవోగా నియమిస్తూ టీటీడీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రిటైర్డ్‌ అధికారులను రిలీవ్‌ చేస్తూ ఉత్వర్వులు జారీ

తిరుమల, మే11(ఆంధ్రజ్యోతి): తిరుమల రిసెప్షన్‌ డిప్యూటీఈవో ఆర్‌2గా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈవోగా నియమిస్తూ టీటీడీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌2గా ప్రస్తుతం డిప్యూటీఈవో ఆర్‌1గా ఉన్న భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక, పద్మవతి అమ్మవారి ఆలయ ఇన్‌చార్జి డిప్యూటీఈవోగా ఉన్న గోవిందరాజన్‌కు పూర్తిస్థాయిలో హెచ్‌ఆర్‌ డిప్యూటీఈవోగా బాధ్యతలు కేటాయించారు. విష్ణునివాసంలో డిప్యూటీఈవోగా ఉన్న విజయ్‌కమార్‌ను టీటీడీ ప్రెస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఈస్థానంలో తిరుపతి పద్మావతి అతిథిగృహాల డిప్యూటీఈవోగా ఉన్న లక్ష్మణ్‌నాయక్‌ను నియమించారు. కాగా, శ్రీవారి ఆలయ డిప్యూటీఈవోగా పలువురు సీనియర్‌ అఽధికారులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తమకు అవకాశమివ్వాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది. త్వరలో మరికొంతమంది డిప్యూటీఈవోల బదిలీలు, ఏఈవోల పదోన్నతులపైనా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

ఫ ఇక, ముగ్గురు విశ్రాంత అధికారులను టీటీడీ నుంచి రిలీవ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వీరివల్ల ప్రస్తుత అధికారులకు పదోన్నతులు లభించడం లేదంటూ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో దుకాణాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్టేట్‌ ఆఫీసర్‌ మల్లికార్జున.. ఇప్పటికీ ఈవో కార్యాలయ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. రిటైరైనా కొనసాగింపుపై విమర్శలు రావడంతో రిలీవ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ప్రెస్‌ విభాగం ఆఫీసర్‌ రామరాజు కూడా పదవీ విరమణ చేసినా కొనసాగుతున్న క్రమంలో ఆయన్నూ తప్పించారు. విగ్రహాల తయారీ విభాగం నుంచీ మరో అధికారిని కూడా రిలీవ్‌ చేసినట్టు సమాచారం.

Updated Date - May 12 , 2025 | 01:45 AM