గురుపౌర్ణమి గరుడసేవ
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:05 AM
గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహనసేవ వైభవంగా జరిగింది. ఆహ్లాదకర వాతావరణంలో తన ఇష్టవాహనమైన గరుడుడిపై సర్వాలంకార భూషితుడై మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహనసేవ వైభవంగా జరిగింది. ఆహ్లాదకర వాతావరణంలో తన ఇష్టవాహనమైన గరుడుడిపై సర్వాలంకార భూషితుడై మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, గోవిందనామ స్మరణల మధ్య గరుడుడిపై గోవిందుడు భక్తులను కటాక్షించారు. గురుపౌర్ణమి కావడంతో తిరుమల, తిరుపతి స్థానికులతో పాటు భక్తులు భారీగా మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి చేరి కర్పూర నీరాజనాలతో మలయప్పస్వామిని దర్శించుకున్నారు. వాహనసేవలో కేంద్రమంత్రి బండి సంజయ్, జీయర్‌స్వాములు, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, అదనపుఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
Updated Date - Jul 11 , 2025 | 02:05 AM