బంగారు కొనుగోళ్ల సందడి
ABN, Publish Date - May 01 , 2025 | 01:40 AM
అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని బంగారు దుకాణాల వద్ద సందడి నెలకొంది. బంగారు ధర పెరిగడంతో కొన్ని రోజులుగా బంగారు కొనుగోళ్లు లేక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
గతేడాది ‘అక్షయ తృతీయ’తో పోలిస్తే సగం తగ్గిన అమ్మకాలు
తిరుపతి(కల్చరల్), ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని బంగారు దుకాణాల వద్ద సందడి నెలకొంది. బంగారు ధర పెరిగడంతో కొన్ని రోజులుగా బంగారు కొనుగోళ్లు లేక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కొందరు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఇక, అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతిలోని బంగారు దుకాణాల్లో రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వ్యాపారం జరిగిందని తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలర్ మర్చంట్ అసోసియేషన్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 50 శాతం వ్యాపారమే జరిగిందని పేర్కొంది.
Updated Date - May 01 , 2025 | 01:40 AM