సూళ్లూరుపేట పాఠశాలకు నిధులు
ABN, Publish Date - Apr 26 , 2025 | 03:22 AM
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ రాజ్యసభ సభ్యుడిగా సూళ్లూరుపేట అభివృద్ధికి నిధులు కేటాయించారు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ రాజ్యసభ సభ్యుడిగా సూళ్లూరుపేట అభివృద్ధికి నిధులు కేటాయించారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్, పూర్వ విద్యార్థి డాక్టర్ కె.నారాయణ విన్నపం మేరకు సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దాదాపు 18 ఏళ్ల కిందట తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలను మంజూరు చేశారు. ఆ సందర్భంగా ఉన్నత పాఠశాలకు వచ్చిన కస్తూరి రంగన్‌ను పూర్వ విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సంఘటనను పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకుంటూ ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 03:22 AM