ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌పై కేసు నమోదు

ABN, Publish Date - May 10 , 2025 | 12:42 AM

తిరుమలలో గాజుల వ్యాపారి.. తిరుపతికి చెందిన జనసేన కార్యకర్త త్రిలోక్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన బెదిరింపు కాల్‌పై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాంకిషోర్‌ కథనం మేరకు.. త్రిలోక్‌కుమార్‌కు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌కు సంబంధించి +923292527504 నెంబరు నుంచి ఫోను కాల్‌ వచ్చింది. ‘నేను పాకిస్థాన్‌కు చెందిన అధికారిని. నీ పేరు త్రిలోక్‌కుమార్‌ కదా? నీ కుటుంబ సభ్యుల పేర్లూ ఇవే కదా. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటిపైన, ఇంట్లోవాళ్లపైన బాంబులు వేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనికి త్రిలోక్‌కుమార్‌ అదే స్థాయిలో హిందీలో దీటుగా సమాధానం చెప్పారు. తమ సైన్యం తగురీతిలో సమాధానం చెబుతోందన్నారు. ఆ తర్వాత ఆయన 100కు కాల్‌ చేసి తనకు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌ వచ్చిందని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఫోను సంభాషణ సమాచారం సేకరించారు. త్రిలోక్‌కుమార్‌ నుంచీ వివరాలు తీసుకున్నారు. దీనిపై విచారించిన అలిపిరి సీఐ రాంకిషోర్‌ కేసు నమోదు చేశారు.

తిరుపతి(నేరవిభాగం), మే 9 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గాజుల వ్యాపారి.. తిరుపతికి చెందిన జనసేన కార్యకర్త త్రిలోక్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన బెదిరింపు కాల్‌పై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాంకిషోర్‌ కథనం మేరకు.. త్రిలోక్‌కుమార్‌కు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌కు సంబంధించి +923292527504 నెంబరు నుంచి ఫోను కాల్‌ వచ్చింది. ‘నేను పాకిస్థాన్‌కు చెందిన అధికారిని. నీ పేరు త్రిలోక్‌కుమార్‌ కదా? నీ కుటుంబ సభ్యుల పేర్లూ ఇవే కదా. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటిపైన, ఇంట్లోవాళ్లపైన బాంబులు వేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనికి త్రిలోక్‌కుమార్‌ అదే స్థాయిలో హిందీలో దీటుగా సమాధానం చెప్పారు. తమ సైన్యం తగురీతిలో సమాధానం చెబుతోందన్నారు. ఆ తర్వాత ఆయన 100కు కాల్‌ చేసి తనకు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌ వచ్చిందని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఫోను సంభాషణ సమాచారం సేకరించారు. త్రిలోక్‌కుమార్‌ నుంచీ వివరాలు తీసుకున్నారు. దీనిపై విచారించిన అలిపిరి సీఐ రాంకిషోర్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - May 10 , 2025 | 12:42 AM