ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బల ప్రదర్శన కోసమే మాజీ సీఎం జగన్‌ పర్యటన

ABN, Publish Date - Jul 10 , 2025 | 02:09 AM

బల ప్రదర్శన కోసమే మాజీ సీఎం జగన్‌ మామిడి రైతుల పేరుతో బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, కలికిరి మురళి మోహన్‌ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగన్‌ పర్యటనతో మామిడి రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉందన్నారు. హింసను ప్రేరేపిస్తూ, రాజకీయ లబ్దికోసమే జగన్‌ పర్యటనకు వచ్చారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మామిడి కేజీ రూ.16 చెల్లిస్తున్నారని తప్పుడు సంకేతాలు పంపుతూ మామిడి రైతులను మోసగిస్తున్నారని అన్నారు

: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
  • జగన్‌ పర్యటనతో రైతులకు ఎలాంటి లాభంలేదు

  • ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌పై దాడి హేయమైన చర్య

  • ఎంపీ , ఎమ్మెల్యేలు

చిత్తూరు సిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): బల ప్రదర్శన కోసమే మాజీ సీఎం జగన్‌ మామిడి రైతుల పేరుతో బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, కలికిరి మురళి మోహన్‌ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగన్‌ పర్యటనతో మామిడి రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉందన్నారు. హింసను ప్రేరేపిస్తూ, రాజకీయ లబ్దికోసమే జగన్‌ పర్యటనకు వచ్చారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మామిడి కేజీ రూ.16 చెల్లిస్తున్నారని తప్పుడు సంకేతాలు పంపుతూ మామిడి రైతులను మోసగిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు రెండు నెలల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహించి మామిడి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా గిట్టుబాటు ధరతో పాటు మామిడి టన్నుకు రూ.4 వేలు సబ్సిడి ప్రకటించారని చెప్పారు. గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో కరోనా సందర్భంగా మామిడికి ధరలు పూర్తిగా పతనమైన సందర్భంలో మామిడి రైతులకు సబ్సిడీ ఇవ్వకపోగా , కనీసం పరామర్శించలేదన్నారు.

  • ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌పై దాడి హేయమైన చర్య

చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌ శివకుమార్‌పై వైసీపీ గూండాలు చేసిన దాడి హేయమైన చర్య అన్నారు. దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్‌, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, చుడడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 02:09 AM