ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించండి

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:35 AM

రైల్వే ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించాలని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజరు సందీప్‌ మాథూర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జీఎం సందీప్‌ మాథూర్‌

తిరుపతి(సెంట్రల్‌), జూన్‌16 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించాలని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజరు సందీప్‌ మాథూర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఎయిర్‌ కాన్‌కోర్సునిర్మాణాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయాలు, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాల గురించి తెలుసుకున్నారు. నిర్మాణాల సమయంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాల గురించి అడిగారు. ఇక, రైల్వే స్టేషన్‌ అభివృద్ధి, తిరుపతి-చెన్నై బైపాస్‌ మార్గం పనులు, రేణిగుంటలో రూ.25 కోట్లతో జరుగుతున్న పనులను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. పూడి- ఏర్పేడు బైపాస్‌ లైన్‌ ప్రాజెక్టు ఏదశలో ఉందని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి- నడికుడి రైలు మార్గం పనులు ఏ దశలో.. ఎలా సాగుతున్నాయని ఆరా తీశారు. ఇలా రెండున్నర గంటల పాటు అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే నిర్మాణాల విభాగం సీఈ సూర్యనారాయణ, ఏడీఆర్‌ఎం సుధాకర్‌, వివిధ విభాగాల అధికారులు వామనమూర్తి, డాక్టర్‌ శ్రావణకుమార్‌, మణికుమార్‌, సాయివిజయ్‌ కుమార్‌, మణికంఠ, సుదర్శన్‌, రమే్‌షకుమార్‌, స్టేషన్‌ డైరెక్టర్‌ కుప్పాల సత్యనారాయణ, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనరు రాజగోపాల్‌ రెడ్డి, సుంకన్న, ఎస్‌ఎంఆర్‌ డాక్టర్‌ కె.చిన్నపరెడ్డి, మాధవరావు, రాంబాబు, ఎం.సందీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జీఎంకు సన్మానం: సౌత్‌ కోస్ట్‌ రైల్వే జీఎంగా తొలిసారిగా తిరుపతికి వచ్చిన సందీప్‌ మాథూర్‌ను మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు సురేష్‌ కుమార్‌, రవీంద్ర నాయక్‌ సన్మానించారు. నాయకులు శ్రీనివాసులు, రాజేష్‌, సుధాకర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 01:35 AM