ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏనుగుల మందతో రైతుల భయాందోళన

ABN, Publish Date - May 19 , 2025 | 01:36 AM

సోమల మండలంలోని ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెబీట్‌లో శనివారం రాత్రి 13 ఏనుగుల గుంపు మామిడి తోటల్లో స్వైరవిహారం చేసింది. రాంపల్లెకు చెందిన బాబురెడ్డి మామిడి తోటలో కాయలను తిని, చెట్లను ధ్వంసం చేశాయి. సమీపంలోని ఆరెకరాల టమోటా తోటల్లో ఊత కర్రలను ధ్వంసం చేశాయి. రెండు నెలల కిందట సదుం, పులిచెర్ల వైపు మళ్లిన ఏనుగులు మళ్లీ మండలంలో ప్రవేశించాయని తెలుసుకున్న రైతులు భయాందోళన చెందుతున్నారు.

రాంపల్లె వద్ద మామిడి తోటలో ఏనుగుల పాదముద్రలు

సోమల, మే 18 (ఆంధ్రజ్యోతి): సోమల మండలంలోని ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెబీట్‌లో శనివారం రాత్రి 13 ఏనుగుల గుంపు మామిడి తోటల్లో స్వైరవిహారం చేసింది. రాంపల్లెకు చెందిన బాబురెడ్డి మామిడి తోటలో కాయలను తిని, చెట్లను ధ్వంసం చేశాయి. సమీపంలోని ఆరెకరాల టమోటా తోటల్లో ఊత కర్రలను ధ్వంసం చేశాయి. రెండు నెలల కిందట సదుం, పులిచెర్ల వైపు మళ్లిన ఏనుగులు మళ్లీ మండలంలో ప్రవేశించాయని తెలుసుకున్న రైతులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు పొలంలోకి వస్తాయోనని కంటిమీద కునుకు లేకుండా కాపు కాస్తున్నారు. ఆవులపల్లె పంచాయతీలోని రాంపల్లె బీట్‌, పట్రపల్లె, కొత్తూరు సమీపంలో వేలకు వేలు ఖర్చు పెట్టి సాగులోకి తెచ్చుకున్న టమోటా తోటలోని ఊత కర్రలను, డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. ఏనుగుల దాడితో సుమారు రూ.4 లక్షల మేర పంట నష్టం జరిగినట్లు వాపోయారు. ఏడాది కిందట కూడా ఈరైతుల పంటలనే ఏనుగులు ధ్వంసం చేయడంతో రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులు పట్రపల్లె ప్రాంతాన్ని సందర్శించారు. సోలార్‌ కంచెతోపాటు ఏనుగుల దాడుల నివారణకు బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని, నష్టపరిహారం పెంచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈక్రమంలో 13 ఏనుగుల గుంపు సంచారంపై అటవీ అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

రాత్రివేళ సంచరిస్తూ..

పెద్దఉప్పరపల్లె, ఆవులపల్లె, చిన్నఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె, పేటూరు పంచాయతీల్లో సుమారు 4వేల ఎకరాల్లో మామిడి, 2వేల ఎకరాల్లో టమోటా సాగులో ఉంది. పదేళ్లుగా ఈ పంచాయతీల్లో ఏనుగులు మకాం వేస్తున్నాయి. అన్నెమ్మగారిపల్లె సమీపంలోని కనికలచెరువు, చిన్నఉప్పరపల్లె సమీపంలోని చెరువుకోన వద్ద అనుకూలంగా ఉండడంతో రాత్రి వేళ సంచరిస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నాయి. ఏనుగుల దాడికి భయపడి ఈ ప్రాంత రైతులు వరి, చెరకు సాగు చేయడం మానుకున్నారు.

Updated Date - May 19 , 2025 | 01:36 AM