ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టమోటా ధరలపై రైతుల ఆశలు

ABN, Publish Date - Jun 29 , 2025 | 01:28 AM

టమోటా ధరలపై రైౖతులు ఆశలు పెంచుకుంటున్నారు. గత 8 నెలలుగా టమోటా ధరలు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో తప్పక టమోటా ధరలు పెరుగుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.

పలమనేరు మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

పలమనేరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): టమోటా ధరలపై రైౖతులు ఆశలు పెంచుకుంటున్నారు. గత 8 నెలలుగా టమోటా ధరలు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో తప్పక టమోటా ధరలు పెరుగుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అయితే జూన్‌ 15 వరకు టమోటా కిలో రూ.10 వరకు పలుకుతుండేది. అయితే ఆ ధరలు పెరుగుతూ వచ్చాయి. గత ఆరు రోజులుగా టమోటా ధరలు కొంత నిలకడగానే పలుకుతున్నాయి. ఈనెల 23న పలమనేరు మార్కెట్‌లో కిలో కనీస ధర రూ.13.70, గరిష్ట ధర రూ.24.70, 24న టమోటా కిలో కనిష్ట ధర రూ.21.60 , గరిష్ట ధర రూ. 24.70, 25న టమోటా కిలో కనిష్ట ధర రూ.17, గరిష్ట ధర రూ.23, 26న టమోటా కిలో కనిష్ట ధర రూ.16, గరిష్ట ధర రూ.20, 27న టమోటా కిలో కనిష్ట ధర రూ.17.80, గరిష్ట ధర రూ.21, శనివారం టమోటా కిలో కనిష్ట ధర రూ.17.70, గరిష్ట ధర కిలో రూ.21.50 పలికాయి. 15 కిలోల టమోటా బాక్సు ధర రూ.300లకు చేరుకుంది. అయితే మళ్లీ ఇప్పుడు వర్షాలు కురిస్తే తోటల్లోనే టమోటాలు మాగిపోయి మార్కెట్‌ కు పెద్ద ఎత్తున తీసుకొస్తే మాత్రం మళ్లీ బాక్సు టమోటాల ధరలు రూ.150 లకు పడిపోయే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వారం క్రితం వరకు పలమనేరు మార్కెట్‌యార్డుకు 400 మెట్రిక్‌ టన్నులకు పైగా రోజూ టమోటాలు వస్తుండగా.. గత మూడు రోజులుగా తక్కువగా వస్తున్నాయి. శనివారం పలమనేరు మార్కెట్‌కు 380 టన్నుల టమోటాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు.

Updated Date - Jun 29 , 2025 | 01:28 AM