ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపటి యోగాంధ్రకు విస్తృత ఏర్పాట్లు

ABN, Publish Date - Jun 20 , 2025 | 02:00 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఎస్వీయూ తారకరామ స్టేడియంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆ రోజు ఉదయం 5.45 నుంచీ 7.15 గంటల వరకూ యోగాసనాలు వేయనున్నారు. దీనికోసం యూనివర్సిటీ నుంచి మూడు వేల మంది, జిల్లా అధికార యంత్రాంగం మరో నాలుగు వేల మందిని సమీకరిస్తోంది. స్టేడియంను పరిశుభ్రంగా మార్చి, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యోగా నిపుణులు, సహాయకులను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని డ్రోన్లతో చిత్రీకరించనున్నారు. ఇక్కడి ఏర్పాట్లను గురువారం కమిషనరు మౌర్య పరిశీలించారు. యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. రెండు రోజుల పాటు వాకర్స్‌, ఇతర క్రీడాకారులను మైదానంలోకి అనుమతించడం లేదన్నారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, పర్యాటకశాఖ ఆర్డీ రమణప్రసాద్‌, ఎస్‌ఈ శ్యాంసుందర్‌, ఎంఈ తులసికుమార్‌ తదితరులున్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్‌ మౌర్య

తిరుపతి(విశ్వవిద్యాలయాలు/క్రీడలు), జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఎస్వీయూ తారకరామ స్టేడియంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆ రోజు ఉదయం 5.45 నుంచీ 7.15 గంటల వరకూ యోగాసనాలు వేయనున్నారు. దీనికోసం యూనివర్సిటీ నుంచి మూడు వేల మంది, జిల్లా అధికార యంత్రాంగం మరో నాలుగు వేల మందిని సమీకరిస్తోంది. స్టేడియంను పరిశుభ్రంగా మార్చి, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యోగా నిపుణులు, సహాయకులను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని డ్రోన్లతో చిత్రీకరించనున్నారు. ఇక్కడి ఏర్పాట్లను గురువారం కమిషనరు మౌర్య పరిశీలించారు. యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. రెండు రోజుల పాటు వాకర్స్‌, ఇతర క్రీడాకారులను మైదానంలోకి అనుమతించడం లేదన్నారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, పర్యాటకశాఖ ఆర్డీ రమణప్రసాద్‌, ఎస్‌ఈ శ్యాంసుందర్‌, ఎంఈ తులసికుమార్‌ తదితరులున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 02:00 AM