గూడూరు మున్సిపల్ స్పెషలాఫీసర్ పదవీకాలం పొడిగింపు
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:30 AM
గూడూరు మున్సిపాలిటీ స్పెషలాఫీసర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగించింది. ఎన్నికలు జరగని కారణంగా గూడూరు మున్సిపాలిటీకి సబ్ కలెక్టర్ స్పెషలాఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తిరుపతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): గూడూరు మున్సిపాలిటీ స్పెషలాఫీసర్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగించింది. ఎన్నికలు జరగని కారణంగా గూడూరు మున్సిపాలిటీకి సబ్ కలెక్టర్ స్పెషలాఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. స్పెషలాఫీసర్ పదవీ కాలం గత నెల 5వ తేదీతో ముగిసిపోయింది. దీంతో గత నెల 6 నుంచీ నవంబరు 5వ తేదీ వరకూ ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 01:30 AM