ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిత్తూరు గంగజాతరకు సర్వం సిద్ధం

ABN, Publish Date - May 12 , 2025 | 01:21 AM

చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు, హేమంత్‌కుమార్‌ వెల్లడించారు.

అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను చూపుతున్న సీకేబాబు తదితరులు

వంశపారంపర్య ధర్మకర్తల వెల్లడి

చిత్తూరు కల్చరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు, హేమంత్‌కుమార్‌ వెల్లడించారు. ఆదివారం స్థానిక బ్రాహ్మణవీధిలోని గీతాసంఘ భవనంలో వారు మీడియాతో మాట్లాడారు. మంగళవారం వేకువ జామున నాలుగు గంటలకు వంశపారంపర్య ధర్మకర్తలైన సీకేబాబు దంపతులు అమ్మవారికి తొలిపూజ చేసి, అంబలి నైవేద్యం సమర్పిస్తామని చెప్పారు. రాత్రి మహా కుంభనైవేద్యం సమర్పించి, బుధవారం సాయంత్రం అమ్మవారిని జలప్రవేశం చేస్తామన్నారు. పోలీసులు, నగరపాలక, వైద్య సిబ్బంది సహకారంతో భద్రత, పారిశుధ్య, వైద్యసాయంపై ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు పలుచోట్ల దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జైన్‌ సంఘం ఆధ్వర్యంలో రెండు లక్షల మంది భక్తులకు మజ్జిగ, తాగునీరు, పళ్లరసాలు వితరణ చేస్తారని తెలిపారు. జాతర ప్రశాంతంగా జరిగేలా నగరవాసులు, అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. అనంతరం అమ్మవారికి అలంకరించనున్న బంగారు, వెండి ఆభరణాలను ప్రదర్శించారు. వీటిల్లో నూతనంగా తయారు చేసిన ముక్కుపుడక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు వెంకటేష్‌, వేమారెడ్డి, కె.ఎన్‌.రవి, గుణశేఖర్‌, సీఆర్‌సీ రవి, ఆర్‌ఎ్‌సఎల్‌ఎస్‌ సుబ్బు, సుభా్‌షజైన్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతరపై ‘నిఘా నేత్రాలు’

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో జరిగే గంగజాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు తరలివస్తారు. అదేస్థాయిలో జేబు దొంగలు కూడా వస్తుంటారు. జాతర నిర్వహించే బజారువీధి, కొంగారెడ్డిపల్లె, మురకంబట్టు, గిరింపేట, తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. అక్కడ 24 గంటలపాటు సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. చిన్న సంఘటన జరిగినా పోలీసులు రంగంలోకి దిగుతారు.

Updated Date - May 12 , 2025 | 01:21 AM