ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటినుంచి ఉద్యోగుల బదిలీలు

ABN, Publish Date - May 16 , 2025 | 01:16 AM

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు సెంట్రల్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ మినహా జిల్లాలోని 98 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ బదిలీలు వర్తించనున్నాయి.శుక్రవారం నుంచి జూన్‌ 2వ తేదీ వరకు బదిలీలకు అవకాశముంది.జిల్లాలో రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఫైర్‌, ఎక్సైజ్‌, రవాణా, అటవీ, జడ్పీ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఖజానా, ఆదాయ పన్ను.... ఇలా దాదాపు 98 శాఖల్లో సుమారు 12 వేల నుంచి 15 వేల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 మే 1 నాటికి ఐదు సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంది. 2026 మే 31 లేదా అంతకు ముందు రిటైరయ్యే ఉద్యోగుల అభ్యర్థన మేరకు బదిలీ చేస్తారు.

వీరికి ప్రాధాన్యత

దృష్టిలోపం, మానసిక వికలాంగులైన పిల్లలుండడం, క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్చుకున్నవారు, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వైద్య కారణాలపై (స్వయంగా, జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లలు) బదిలీ కోరుకునే ఉద్యోగులు వైద్య సౌకర్యాలు అందుబాటు కోసం కోరుకునే స్టేషన్‌కు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

వీరికి కలెక్టర్‌ ఆమోదం తప్పనిసరి

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీ్‌స బేరర్లకు బదిలీలపై స్టాండింగ్‌ సూచనలు వర్తిసాయి. ఈ జాబితాను కలెక్టర్‌ ద్వారా ఆయా శాఖలకు పంపాల్సి ఉంటుంది.

Updated Date - May 16 , 2025 | 01:16 AM