ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్షమందికి పైగా ఈకేవైసీ పెండింగ్‌

ABN, Publish Date - May 06 , 2025 | 01:10 AM

రేషన్‌కార్డుదారులంతా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.ఇంకా 1,03,289మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది.

చిత్తూరు కలెక్టరేట్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుదారులంతా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.ఇంకా 1,03,289మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌ నెలతో ముగిసిన గడువును మరో రెండు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ-పోస్‌ పరికరాల ద్వారా రేషన్‌ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్ద ఈకేవైసీ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతోపాటు ఆన్‌లైన్‌లో కూడా చేసుకునే వెసులుబాటు ఉన్నా, ప్రజలకు అవగాహన లేదు. జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో వీరంతా డీలర్లు, ఎండీయూ వాహనాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. సమీపంలోని డీలర్ల వద్దకు వెళ్లినా, ఆ కేంద్రాలు మూసి ఉంటున్నాయి. ఎండీయూ వాహనాలు వచ్చే సమయంలో కార్డుదారులంతా పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సమస్యలతో లక్షమందికిపైగా కార్డుదారులు సకాలంలో ఈ ప్రక్రియ పూర్తిచేసుకోలేని స్థితిలో పడ్డారు.జిల్లాలో రేషన్‌కార్డుదారులు 16,70,470మంది కాగా వీరిలో ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తయినవారు 15,37,402మంది. ఈకేవైసీ చేసుకోనివారు 1,03,289మంది ఉన్నారని డీఎస్వో శంకరన్‌ వివరించారు.

Updated Date - May 06 , 2025 | 01:10 AM