ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దుగరాజపట్నం దశ తిరుగుతోంది!

ABN, Publish Date - May 15 , 2025 | 01:47 AM

పోర్టు ఆగిందన్న బాధ ఇంతకాలం వారిని పట్టి పీడించింది. ఇప్పుదే స్థానంలో నౌకా నిర్మాణం ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించింది. దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ యూనిట్‌ స్థాపించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.

తూపిలిపాళెం వద్ద సముద్రమార్గంలో వెళుతున్న నౌక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నౌకా నిర్మాణ కేంద్రం

రూ.3,500 కోట్ల వ్యయం

వేల మందికి ఉపాధి

పోర్టు ఆగిందన్న బాధ ఇంతకాలం వారిని పట్టి పీడించింది. ఇప్పుదే స్థానంలో నౌకా నిర్మాణం ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించింది. దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ యూనిట్‌ స్థాపించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ అధికారులతో సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడుతుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. - గూడూరు, ఆంధ్రజ్యోతి

వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద 15 ఏళ్ల కిందట ఓడరేవు నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి 2014లో తూపిలిపాళెం, కొండూరుపాళెం, అంజలాపురం, పామంజి, వాగర్రు, శ్రీనివాసపురం గ్రామాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించారు. సుమారు 2,700 ఎకరాలు తూపిలిపాళెం రెవెన్యూపరిధిలో గుర్తించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. విభజనహామీ చట్టంలోనూ దుగరాజపట్నం పోర్టును పొందుపరిచినా ఆ దిశగా ముందుకు సాగలేదు. ఇక్కడికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టు ఏర్పాటవడం.. దుగరాజపట్నం పోర్టు ఆగడంతో స్థానికుల్లో ఆవేదన నెలకొంది. ఈ క్రమంలో దుగరాజట్నం పోర్టు స్థానంలో తూపిలిపాళెంలో రెండు వేల ఎకరాల్లో రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం, ఓడల మరమ్మతుల యూనిట్‌ ఏర్పాటు చేసేలా ఎన్టీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో షిప్‌ బిల్డింగ్‌, రిపేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. నౌకా నిర్మాణ కేంద్రానికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మరో వెయ్యి ఎకరాలను సేకరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి 2,700 ఎకరాలను సర్వేచేసి గుర్తించి ఉండటంతో భూసేకరణ ప్రక్రియ మరింత సులభతరంగా, వేగవంతగా జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సుమారు రూ.26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుంటుందని అధికారుల అంచనా. ఇక, నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయని అధికారుల సమీక్షలో సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో తమ ప్రాంతానికి మహర్దశ రానుందని స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు

ఎన్టీయే అధికారంలోకి రావడంతో గూడూరు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చిల్లకూరు, కోట మండలాల్లో క్రిస్‌సిటీ పేరిట 10 వేల ఎకరాలకుపైగా భూముల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు కానుంది. ఈ మొదటి దశ పనులు చిల్లకూరు మండలంలో వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు కృష్ణపోర్టును అనుసంధానం చేసేలా చిల్లకూరు, కోట మండలాల్లో సాగరమాల రోడ్డు పనులు చేపట్టారు. ఇప్పుడు వాకాడు మండలంలోని దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో తీరప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనుంది.

రూపుమారనున్న తూపిలిపాళెం

చిల్లకూరు, కోట, వాకాడు మండలాలల్లోని సముద్రతీరాలలో తూపిలిపాళెం బీచ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా బీచ్‌కు వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది తూపిలిపాళెమే. ప్రశాంతమైన వాతావరణం, చల్లని అలల హోరు, ఆహ్లాదకరమైన సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఈ బీచ్‌ను ఇష్టపడతారు. ఇక, మత్స్యకారులూ ఇక్కడి నుంచే పడవలతో సముద్రంలోకి వేటకు వెళతారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయలేదు. కానీ, నౌకా నిర్మాణ కేంద్రం, ఇతర పరిశ్రమలు ఏర్పాటైతే తూపిలిపాళెం రూపురేఖలు మారడంతో పాటు పర్యాటకంగా బీచ్‌ అభివృద్ధి చెందనుంది.

Updated Date - May 15 , 2025 | 01:47 AM