ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నలుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:26 AM

ఇదివరకు నగరి తహసీల్దార్‌గా పనిచేసిన కె.వెంకటరమణతో పాటు మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది.

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఇదివరకు నగరి తహసీల్దార్‌గా పనిచేసిన కె.వెంకటరమణతో పాటు మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీసీఎస్‌ 1991లోని రూల్‌ (20) కింద వారిపై చార్జి ఆర్టికల్‌ జారీచేయబడింది. ఇందుకు సంబంధించి విచారణ అధికారిణిగా జేసీ విద్యాధరిని బుధవారం నియమిస్తూ నెల రోజుల్లోగా నివేదిక పంపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఆదేశించారు.గతంలో నగరి తహసీల్దార్లుగా పనిచేసిన కె.వెంకటరమణ, కె.బాబు, కె.సదాశివ పిళ్లై (రిటైర్డ్‌ గ్రామ రెవెన్యూ అధికారి), గతంలో నగరి మండలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన బి.దేవదాసులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. నగరి మండలంలోని సర్వే నెం. 4/2, 4/4, 109/1, 109/3లోని ప్రభుత్వ భూముల్లో ఆర్‌.సిద్ధయ్య నాయుడు అనే వ్యక్తి దురాక్రమణ చేసినట్లు తెలిసినా, ఉద్దేశపూర్వకంగా ఆ ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోలేదనే ఆరోపణపై లోకాయుక్త సంస్థకు తప్పుడు నివేదికలు సమర్పించినందుకు వారిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ అధికారిగా జేసీ విద్యాధరిని నియమించింది. దీనిపై క్రమశిక్షణా అధికారి తరపున కేసును సమర్పించేందుకు నగరి రెవెన్యూ డివిజనల్‌ అధికారిని ప్రిసెంటింగ్‌ అధికారిగా నియమించింది. ఈయన ఈ కేసుకు సంబంధించిన రికార్డులను, పత్రాలను కలెక్టరేట్‌ నుంచి పొంది విచారణ అధికారిగా నియమించిన జేసీ ఎదుట సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jul 31 , 2025 | 12:26 AM