ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదం బాస్‌!

ABN, Publish Date - May 31 , 2025 | 01:25 AM

చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై కల్లూరు సర్కిల్లో మామిడికాయల ట్రాక్టర్‌పై కూలీల ప్రయాణమిది. పీలేరు, రొంపిచెర్ల, సదుం, సోమల, పులిచెర్ల, కేవీపల్లె తదితర మండలాల నుంచి నిత్యం మామిడికాయల లోడుతో వందల ట్రాక్టర్లు దామలచెరువు మండీలకు వెళుతుంటాయి.

చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై కల్లూరు సర్కిల్లో మామిడికాయల ట్రాక్టర్‌పై కూలీల ప్రయాణమిది. పీలేరు, రొంపిచెర్ల, సదుం, సోమల, పులిచెర్ల, కేవీపల్లె తదితర మండలాల నుంచి నిత్యం మామిడికాయల లోడుతో వందల ట్రాక్టర్లు దామలచెరువు మండీలకు వెళుతుంటాయి. మామిడికాయల సీజన్‌ మొదలైనప్పటి నుంచి సీజన్‌ ముగిసేవరకు దామలచెరువులోని మండీలకు వెళ్లే ట్రాక్టర్లు కల్లూరు ఘాట్‌రోడ్డు మార్గంలోనే వెళ్లాల్సి ఉంది. అయితే మామిడికాయలతో వెళుతున్న ట్రాక్టర్లు ఘాట్‌రోడ్డులో ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.అనేక మంది కూలీలు గాయపడగా, కొంతమంది మృత్యువాత కూడా పడిన సందర్భాలున్నాయి. ట్రాక్టర్‌ ట్రాలీలపై ప్రయాణం ప్రమాదమని చెబుతున్నా డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. జ్యూస్‌ ఫ్యాక్టరీలు తెరిస్తే మరింత జోరందుకోనున్న ఈ ట్రాక్టర్‌ ట్రాలీల ప్రయాణాలపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనావుంది.

-కల్లూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - May 31 , 2025 | 01:25 AM