ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖర్చులకు ఎగబడి.... వివరాలివ్వడంలో వెనుకబడి

ABN, Publish Date - Apr 12 , 2025 | 01:21 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1412 పంచాయతీలున్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తుంటాయి. వాటిని ఖర్చు చేయడంలో లెక్కలు సరిగ్గా ఉండకపోవడంతో ఏటా 15వేల నుంచి 20వేలకు పైగా ఆడిట్‌ అభ్యంతరాలు వస్తున్నాయి. రెండుమూడేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి పంచాయతీ అధికారులు బదిలీ కావడం, గతంలో పనిచేసిన వారు చేసి ఖర్చుకు, వచ్చిన నిధులకు లెక్కలు చూపకపోవడంతో కొత్తగా వచ్చిన వారు తమకేమీ సంబంఽధం లేదని చేతులెత్తేస్తున్నారు.

జిల్లా అధికారుల్లో లెక్కలేనితనం

పెరిగిపోతున్న ఆడిట్‌ అభ్యంతరాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1412 పంచాయతీలున్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తుంటాయి. వాటిని ఖర్చు చేయడంలో లెక్కలు సరిగ్గా ఉండకపోవడంతో ఏటా 15వేల నుంచి 20వేలకు పైగా ఆడిట్‌ అభ్యంతరాలు వస్తున్నాయి. రెండుమూడేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి పంచాయతీ అధికారులు బదిలీ కావడం, గతంలో పనిచేసిన వారు చేసి ఖర్చుకు, వచ్చిన నిధులకు లెక్కలు చూపకపోవడంతో కొత్తగా వచ్చిన వారు తమకేమీ సంబంఽధం లేదని చేతులెత్తేస్తున్నారు.

దేవదాయ శాఖ పరిధిలో ఫైళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తిరుపతి మినహా మిగిలిన దేవాలయాలకు భక్తులిచ్చే కానులకు లెక్కపత్రాలు సరిగ్గా ఉండడం లేదు. ఆలయాలకు వచ్చిన ఆదాయానికి చేసిన ఖర్చులకు అసలు పొంతన ఉండటం లేదు.

చిత్తూరు నగర పాలక సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా ఆడిట్‌ అభ్యంతరాలు పేరుకుపోయాయి.

ద్రవిడ యూనివర్శిటీ విషయానికొస్తే ఇది ఏర్పడినప్పటి నుంచి ఏటా అభ్యంతరాల చిట్టా పెరుగుతూనే ఉంది. నిధులు నీళ్లలా ఖర్చు చేసి సమాధానాలు ఇవ్వడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో రూ. 1106.54 కోట్లకు సంబంధించి లెక్కలు కనిపించడం లేదు. తాజాగా 232532 ఆడిట్‌ అభ్యంతరాలకు అధికారులు సమాధానాలు ఇవ్వడం లేదు.

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఖర్చుకు సంబంధించి స్పష్టమైన లెక్కలుండాలి.అయితే చేపట్టిన పనులకు, ఖర్చు చేసిన నిధులకు పొంతన కుదరడం లేదు. ఒక పద్దు కింద విడుదలైతే మరో పద్దు కింద వెచ్చిస్తున్నారు. లెక్కలు సరిగా లేకపోవడంతో ఆడిట్‌శాఖ అభ్యంతరాలు చెబుతోంది. వీటికి ఆయా శాఖలు సరైన ఆధారాలు అందించి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఏ ఏడాదికి సంబంధించిన ఆదాయ వ్యయాలను ఆ మరుసటి ఏడాదిలోపే ఆడిట్‌ చేసి నివేదికలు అందించాలన్నది ప్రభుత్వ నిబంధన.అయితే దీన్ని ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు కార్యాలయాల్లో ప్రజాధనం వినియోగంపై ఆడిట్‌శాఖ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు కొదవ లేదు. ప్రజాఽధనాన్ని పారదర్శకంగా వినియోగించి వాటి ఆదాయ వ్యయాలు ఎప్పటికప్పుడు ఆడిట్‌శాఖకు వివరించాల్సి ఉంది. చాలా చోట్ల ఆడిట్‌ అభ్యంతరాలకు సంవత్సరాల తరబడి సమాధానం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆడిట్‌ అభ్యంతరాలన్నింటికీ సమాధానాలు ఇస్తేనే ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది. ఆడిట్‌ విభాగం అధికారులు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఆదాయ వ్యయాల్లోని వ్యత్యాసం, ఖర్చుకు తగిన రసీదులు, చెల్లింపుల్లో అధికం, అనుమతి లేని అడ్వాన్సు చెల్లింపులు, ఇతరత్రా వాటిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆడిట్‌ చేసి పేరా వైజ్‌ రిమార్కులు రాసి అభ్యంతరాలు తెలిపినా సమాధానం సక్రమంగా ఇవ్వడం లేదు.

శాఖ అభ్యంతరాలు విలువ(రూ. కోట్లలో)

-------------------------------------------------------------------------------------------------

గ్రామ పంచాయతీలు 213876 91.90

మండల పరిషత్‌లు 7584 30.,48

మార్కెట్‌ కమిటీలు 829 18.47

చిత్తూరు నగరపాలక సంస్థ 936 279.98

దేవాదాయశాఖ 2945 3.98

ద్రవిడ యూనివర్శిటీ 1946 184.89

జిల్లా పరిషత్‌ 899 387.50

జిల్లా గ్రంథాలయ సంస్థ 1476 28.00

మున్సిపాలిటీలు 2041 81.34

------------------------------------------------------------------------------------------------

మొత్తం 232532 1106.54

----------------------------------------------------------------------------------------------

సమాధానాలు ఇవ్వడం లేదు

ప్రభుత్వశాఖల్లో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం,నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడంతోనే ఆడిట్‌ అభ్యంతరాలు వస్తున్నాయి. ఏ సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ అభ్యంతరాలను ఆ మరుసటి సంవత్సనాటికి పరిష్కరించుకోవాలి. ఇలా చేయకపోవడంతో పరిష్కరించుకోవాలంటూ ఏటా నాలుగైదు సార్లు రిమైండర్లు పంపుతున్నాం. అఽయినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆడిట్‌ అభ్యంతరాల సంఖ్చ పెరిగిపోతుంది.

-కృష్ణారెడ్డి, జిల్లా ఆడిట్‌ అధికారి, చిత్తూరు

Updated Date - Apr 12 , 2025 | 01:21 AM